చైత్ర కృష్ణ త్రయోదశి , స్వామి సమర్థ పుణ్య తిథి.*
*"నా మూలం వటవృక్షం. నా జన్మస్థలం దత్త నగరం " అని వటవృక్షస్వామిగా, కలియుగములో దత్త పంచకములో ఒకరైన అక్కల్ కోట మహరాజ్ గా పేరుపొందిన స్వామీసమర్ధ.*
*శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నృశింహ సరస్వతిస్వామి, మాణిక్య ప్రభువులు, ఈ ముగ్గురూ శ్రీస్వామి సమర్థుల ముందున్న దత్తావతారాలు.*
*దత్తావతారాలలో విశేషము ఏమనగా తనవద్దకు వచ్చిన సాధకుడు, ఏ గురువును లేదా ఏ దేవతను ఆరాధిస్తున్నాడో, ఆ గురుస్వరూపాలుగా, ఆ దేవతా స్వరూపాలుగా, ఆ సాధకునికి దర్శనమిచ్చి, ఆ స్వరూపాలన్నీ తనవే నని వెల్లడించడం.*
*అంటే భిన్నత్వంలో ఏకత్వం.*
*శ్రీషిర్దీ సాయిబాబా వలె స్వామీ సమర్థుల పుట్టు పూర్వోత్తరాలు, కులగోత్రాలు తెలియవు.**
*మొట్ట మొదటిగా 1856 సం. లో అక్కల్కోట గ్రామములో ప్రకటితమై, షుమారు 22 సంవత్సరాలు అనగా 1878 సం. వరకు నివసించి నందున, వారిని అక్కల్కోట మహరాజ్ గా భక్తులు పిలిచేవారు.*
*శ్రీస్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేది.*
*వారు మిగతా దత్తస్వరూపాలవలె, తమ జీవిత కాలములో అనేక లీలల ద్వారా భక్త సంరక్షణ, ఉద్దరణ గావించెడివారు.*
*"అఖండ విశ్వమే నేను, నేను సర్వత్రా ఉంటాను" అనేవారు.*
*"బాలోన్మత్త పిశాచవత్ " అన్నట్లు ఈ అవతారంలో అవధూతగా, ఉన్మత్తుడిగా, బాలుడిగా సంచరించి అద్భుత లీలలు ప్రకటించారు.*
*శ్రీస్వామి అవతారం చాలిస్తారని తెలిసి చివర రోజులలో కేశవ నాయక్ అనే భక్తుడు స్వామితో "స్వామీ మీరు ఈ అవతారం చాలించిన తరువాత, మాకు దిక్కెవ్వరు ? అని అడుగగా " నా అవతారము షిరిడీలో ఉన్నది.*
*అక్కడకి వెళ్లి ఆ స్వామిని ఆశ్రయించండి " అని అన్నారు.*
*చివరగా, బహుధాన్య సంవత్సరం అనగా 1878 సం. ఏప్రియల్ 30 వ తేది, చైత్ర మాసం బహుళ త్రయోదశి, మంగళవారం సాయంకాలం 4.౩౦ గం. లకు తమ అవతార సమాప్తి గావించారు.*
*శ్రీ సాయిసచ్చరిత్ర (ప్రత్తి నారాయణరావు ) తెలుగు గ్రంథం ఉపోద్ఘాతంలో షిర్డిసాయిబాబా వారు అక్కల్కోట మహరాజ్ష తదుపరి అవతారంగా అయిదవ అధ్యాయములో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్టించిన కధయు, 26 వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితళే కథయు శ్రీ అక్కల్కోట మహరాజ్ అవతార పరంపరయే శ్రీ షిర్డీ సాయిబాబా " అని వ్రాయబడినది.*
*అందుకే శ్రీ సాయిబాబాను కలియుగంలో అయిదవ దత్తావతారంగా భక్తులు విశ్వసిస్తారు.*
*శ్రీ స్వామీ సమర్థ నామజపం - మహరాజ్ శ్రీ స్వామీ సమర్థ !*
*జై జై స్వామీ సమర్థ శ్రీస్వామీ సమర్థ ! జై జై స్వామీ సమర్థ !*
No comments:
Post a Comment