Thursday, May 16, 2024

మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ధూప్ ఆరతిలో ప్రత్యేకంగా శివుని ఆరతి గీతం పాడుతారు.

 


*మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు  ధూప్ ఆరతిలో ప్రత్యేకంగా శివుని ఆరతి గీతం పాడుతారు.*


*ఈ రోజు ఇచ్చే ధూప్ ఆరతికి ఒక ప్రత్యేకత ఉన్నది.*


*బాబా వారికి ఒక వత్తుతో హారతి ఇవ్వకుండా అయిదు వత్తులతో పంచ ఆరతి ఇస్తారు.*


*మధ్యాహ్న హారతి ప్రారంభం నుండి  మరుసటి రోజు కాకడ ఆరతి ముగింపు వరకు బాబావారి సమాధి ముందు శివుని ఫొటో పెట్టి, బాబా వారి విగ్రహానికి, సమాధిపై మారేడు దళముల మాలలు, స్వర్ణ ( బంగారు ) దండలు వేస్తారు..*

*(పూలమాలతోపాటు).*


*మహాశివరాత్రి కి అన్ని ఆరతులకు సాయినాథుని వారిని శ్వేత  వస్త్రాలతో ( తెల్లని ) అలంకరిస్తారు.*


*ఈ రోజు ధూప్ ఆరతి సాయంత్రం 6 గంటలకు*


*( మాఘ మాసంలో ధూప్ ఆరతి సాయంత్రం 6.30 గంటలకు )*


*ధూప్ ఆర్తికి ముందు మనం సాయికి నైవేద్యం సమర్పిస్తారు.*


*( ప్రతి రోజు ధూప్ ఆరతి తరువాత నైవేద్యం సమర్పిస్తారు)*


*మహాశివరాత్రి సందర్భంగా ధూప్ ఆరతిలో ఆలపించే శివ భగవానుని ఆరతి గీతం క్రింద ఇవ్వబడినది.*





*ఇది హారతి సాయిబాబా లో  "ఇచ్ఛిత దీనచాతక "*


 తరువాత 

*" శిరిడి మాఝే పండరీపుర"*


 ముందు పాడుతారు.



లవధవతీ విక్రాళా బ్రహ్మండీ మాళా ; విషే కంఠ కాళా త్రినేత్రి జ్వాళా 

లావణ్య సుందర మస్తకీ భాళా 

                                     తేధునియా జళ నిర్మళ వాహే ఝళ ఝాళా 

జయదేవ జయదేవ జయ శివశంకరా ,

                             స్వామిశంకరా   ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ  కర్పూరగౌరా

కర్పూరగౌరా భోళా నయనీ విశాళా, అర్దాంగీ పార్వతీ సుమనాంఛ్హా మాళా 

విభూతీచే ఉధళణ శివకంఠ నీళా ఐసా శంకర శోబే ఉమా వేల్హళా 

 జయదేవ జయదేవ జయ శివశంకరా,  

                            స్వామిశంకరా  ఆరతీ  ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా 

దేవీ ధైత్యీ సాగరమంధన పైం కేరే, త్యమాజీ అవచిత్ హోళా హళ ఉఠీలే 

తే త్యా అసురఫణే ప్రాశన్ కేలే నీలకంఠ నామ ప్రసిద్ధ  ఝాలే 

  జయదేవ జయదేవ జయశివశంకరా,

                           స్వామిశంకరా  ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా  

వ్యాఘ్రబర ఫణివరధర సుందర మదనారీ 

                పంచానన మనమోహన మునిజన సుఖకారీ 

శతకోటిచే బీజ వాచే ఉచ్హారీ, రఘుకులతిలక రామదాసి అంతరీ 

జయదేవ జయదేవ జయశివశంకర,

                       స్వామిశంకర ఆరతీ ఓవాళు భవతీ ఓవాళూ తుజ కర్పూరగౌరా 

                              

జయదేవ జయదేవ 

 

*మరాఠి భాషలో శివుని కిచ్చే హరతికి తెలుగులో అర్ధాన్ని, భావాన్ని సాయి* *గురుబంధువులందరికీ* 



మొదటి చరణం -లవదవతి విక్రాల ...

భావం .

రుద్రరూపము కలిగి, తాండవ నృత్యముచేయుచు అతి భయంకర స్వరూపముతో భక్తులకు దర్శనమిచ్చుచున్నాడు.

హాలాహలమనే భయంకర విషాన్ని మింగుటచే

నీలిరంగు కంఠం కలిగినవాడైనాడు. 

శిరస్సు ఫాలభాగమున మూడవ నేత్రము కలగుటచే త్రినేత్రుడైనాడు.

 శిరస్సున జటాజూటములచే, పావన గంగను ఆ జడలనందు కలవాడు.

అతి సుందరవదనము కలవాడు ఆ శివుఁడు ఆ పరమాత్మ ఉగ్రరూపము ధరించిననూ లోక కళ్యాణం కొరకు భూమండలం నాశనం కాలేదు.

జయము జయము శ్రీ శంకరా! కర్పూర గౌరా !


(కర్పూరమువలె తెల్లని ముఖచాయ కలవాఁడు )

నీకు హారతి సమర్పిస్తున్నాము.


కర్పూర గౌరా భోళా నయన విశాలా ...భావం.


లవదవతి విక్రాల ...శివహారతి. రెండవ చరణం 

భావము.


ధవళ వర్ణము కలిగి, మవిశాలనేత్రాలు కలిగిన సుందరరూపుడు, పార్వతిమాతకు తన శరీరములో అర్ధభాగమిచ్చి అర్ధనారీశ్వరుడైనాడు 

భక్తులచే సుగంధ పరిమళ పుష్పహారములచే ఆరాధింపబడు చున్నవాడైనడు. శరీరమంతా పవిత్ర విభూతి ధారణ చేయువాడు. లీలా విలాస స్వరూపుఁడు. నీలి రంగు కంఠము కలిగినవాడు

ఉమాదేవికి ప్రియసఖుడు అయిన శంకరునికి

జయదేవ జయదేవ జయశ్రీశంకరా !

ఓ కర్పూరగౌరా ! ఇవే మీకు మా హారతులు.


మూడవ చరణం ...


దేవతలు రాక్షసులు సాగర మధనం గావించు సమయమున, ఈ సృష్టి యావత్తు నాశనం చేయగల భయంకర విషపూరితమైన హాలాహలం సృష్టిలోగల సకల ప్రాణులయందు కల ప్రేమతో, సంతోషముతో తాను స్వీకరించి కాపాడెను.

వేరెవరూ  నీలి వర్ణం గల  ఆ హాలాహలమును మింగుటకు సాధ్యం కాలేదు. ఆ విధముగా శంకరుడు నీలికంఠుడైనాడు.

జయదేవ జయదేవ

జయ శ్రీశంకరా ! ఓ కర్పూరగౌరా ! ఇవే నీకు

మా హారతులు.



నాల్గవ చరణం ...భావం.


పులి చర్మమును ధరించినవాడు. అనేక విశేషములు కలిగిన, వాసుకి అనే సర్పమును తన కంఠమున  ధరించినవాడు, మన్మధ సంహారం 

గావించినవాడు, అయిదు ముఖములు కలిగి సుందరరూపముతో తనను ధ్యానించే, ముని జనులకు శాంతి ప్రసాదించువాడు, అసంఖ్యాక

బీజాక్షరములతో నిండిన, రఘువంశంలో జన్మించిన రామా -రామదాసా అను నామమును స్మరించువాడైన శంకరుణ్ణి ఇంతకన్నా ఎంతని, ఏమని, వర్ణించగలను, ఎంతని స్తోత్రం చేయగలను ? 


జయదేవ జయదేవ

జయ శ్రీశంకరా ! ఓ కర్పూర గౌరా ! నీకు ఇవే మా హారతులు.


సాయి సేవలో


*పాశిల అప్పారావు*

రాజమహేంద్రవరం


చిల్లర కృష్ణమూర్తి

చెన్నై


🕉️🪘🔱🕉️🪘🔱🕉️🪘🔱

No comments:

Post a Comment