Thursday, May 16, 2024

సాయి భక్తుడు సాయి బాబా నే పూజిస్తాడు. అర్చిస్తాడు.* *సాయి తెలిపిన పారాయణ గ్రంధాలు పారాయణ చేస్తాడు.* *ఇలా ఎన్నో మార్గాల ద్వారా సాయిని మదిలో నిలుపుకొనుటకు ప్రయత్నిస్తాడు.* *సాయిని తప్ప వేరెవరినీ ధ్యానించడు, ప్రార్ధించడు.* *అంటే కేవలం సాయికే అంకితమై ఉంటాడు.*

 *సాయి భక్తుడు సాయి బాబా నే పూజిస్తాడు. అర్చిస్తాడు.*

*సాయి తెలిపిన పారాయణ గ్రంధాలు పారాయణ చేస్తాడు.*

*ఇలా ఎన్నో మార్గాల ద్వారా సాయిని మదిలో నిలుపుకొనుటకు ప్రయత్నిస్తాడు.* 

*సాయిని తప్ప వేరెవరినీ ధ్యానించడు, ప్రార్ధించడు.* 

*అంటే కేవలం సాయికే  అంకితమై ఉంటాడు.*


*బెంగళూరు నివాసి శ్రీ M. రామారావు సాయి పరిధిలోకి వచ్చాడు.*

*ఆయన కుమార్తె అత్తవారు మధ్వ సాంప్రదాయానికి చెందిన వారు.* 

*ఆయన కూతురు కూతురు అంటే మనుమరాలు చిన్న బిడ్డ రామారావు గారి వద్దనే ఉంటుంది.*


*ఒక సారి ఆ బిడ్డకు నలతగా వుంది. రామారావు గారి భార్య, భర్తను రాఘవేంద్రస్వామి మఠమునకు పోయి మనుమరాలికి నవగ్రహ తాయత్తు తీసుకు రమ్మని చెప్పింది.*

*రామారావు గారు ఎప్పుటికప్పుడు వాయిదా వేస్తూ, ఆ తాయత్తు తేవడానికి, ఎందుకంటే అతను సాయిబాబానే నమ్ముకున్నాడు.*

*వేరొకదైవమువద్దకు పోయి తాయత్తు తెచ్చుట సాయి భక్తికి భంగం అవుననే ఉద్దేశ్యంతో తెచ్చుట లేదు.* *కానీ  ఒకసారి తెచ్చుట తప్పని సరి అయింది. అది మార్చి నెల 11న 1986 లో జరిగింది. ఆయన తాయిత్తు తెచ్చుట సమంజసమా? కాదా? అను మిమాంస లో పడిపోయాడు.*

*అదే సమయం లో ఆ పరిసర ప్రాంతంలో నున్న T. K . అయ్యంగార్ అనే సత్పురుషుని తాను చేసినది సబబా? కాదా? అని ప్రశ్నించాడు.* 

*అందుకు అయ్యంగార్ ఉన్నది ఒకటేనని, అంతా ఏకత్వమని అభిప్రాయాన్ని చెప్పాడు.*

*పురంతరదాసు శైవ సాంప్రదాయకుడు, అయినను శ్రీహరిని కీర్తించాడు.*

*విజయదాసు మధ్వయోగి అయిననూ శివుని కీర్తించాడు.*

*ఇక సాయిసాహిత్యంలోకి వస్తే, మాతాజీ కృష్ణ ప్రియ రాఘవేంద్రస్వామి భక్తురాలు, చివరకు సాయి భక్తురాలైంది.*


*ఏ యోగి చెప్పినా యోగు లందరూ ఒకటి అని భావన కలుగుతుంది.*

No comments:

Post a Comment