Sunday, May 19, 2024

సాయి సచ్చరిత్ర చదవటంవల్ల ఇతరులకు ఏవేవో మంచి ఫలితాలు వచ్చాయి. కానీ నాకే ఫలితం కనిపించలేదు.

*సాయి సచ్చరిత్ర చదవటంవల్ల ఇతరులకు ఏవేవో మంచి ఫలితాలు వచ్చాయి. కానీ నాకే ఫలితం కనిపించలేదు. నేను భక్తుడిని కానా ?అని అనేకమందికి సందేహాలు వస్తుంటాయి.* *నేను అందరిలాగే పారాయణ చేసాను. వాళ్లందరికీ మంచి ఫలితాలు వచ్చాయి.* *నాకెందుకు రాలేదని వాపోతుంటారు.* 
*ఫలితం రాలేదు అంటే బాధపడాల్సింది ఏమీ లేదు.* *అయితే ఇతరులకు వచ్చాయని బాధపడతారు.**అదే వద్దు *సాయి బాబా ఏం చెప్పారు ? ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అలాగని అడగడం మానవద్దు.* 
*ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి చాలమంది తెలివిగా నాకు ఏది మంచిదో అది చేయి బాబా అని ప్రార్ధిస్తుంటారు.* *సాయినాధుడు కూడా తెలివైనవాడే. నీకు ఏది మంచిదో తెలియనప్పుడు నేనేం చేస్తాను.* *నీకు తెలిసినప్పుడు నన్ను అడుగు అని ఊరుకొంటాడు.* *అంతే తప్ప చేయలేక కాదు.*
*మనకు మనసు, బుద్ధి,‌ చిత్తము, అహంకారం అను నాలుగు అంతఃకరణాలు* *ఇచ్చిన భగవంతుడు మీరు దానిని ఉపయోగించు కొంటారనే ఆశిస్తాడు.* 

*నేను ఏమీ ఆలోచించను,* *నువ్వే చేసుకో అని భగవంతునితో అనడం తప్పే మనం చేయగలిగేటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ, మనం ఎక్కడ ఏమి చేయాలో అది ఆచరిస్తూ, నాకీ బాధ ఉందని చెబుతూ, సాయి చరిత్ర పారాయణం చేసినటువంటి వ్యక్తులకు వారి బాధలు తీరలేదన్న* *మాటను అరుదుగా కనిపిస్తుంది.*
 *కొందరికి ముందు జరగవచ్చు, మరికొందరికి ఆలస్యంగా జరగవచ్చు.*
*అంతే !సాయి సచ్చరిత్ర పారాయణం, గురుచరిత్ర పారాయణం, అసలెందుకు చేయాలనేదానికి వ్యాసుడి దగ్గరనుంచి మనకు సమాధానం లభిస్తుంది.* 

*వ్యాసుడు నాలుగు వేదాలను క్రోడీకరించాడు.* *108 ఉపనిషత్తులను రాసాడు.* 
*24 స్మృతులు, 24 గీతలు రాశాడు.*
*మహాభారతం రాశాడు.* *18 పురాణాలు, ఉప పురాణాలు రాశాడు.*
 *అంటే అధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి అందచేయడానికి ఎన్ని పనులు చేయగలడో అన్ని పనులు చేశాడు.* 
*రాసేసిన తరువాత సరస్వతినది ఒడ్డున గల తన ఆశ్రమములో విచారంగా కూర్చున్నాడు.*

*వ్యాసుడికి లోపల ఏదో తెలియని ఆవేదన.*

*మానవులకు పనికొచ్చేది, మానవుల సాధనకు పనికివచ్చే విషయాన్ని ఏదో అందించలేకపోయానని ఆయన బాధ పడుతుండగా నారదుడు అక్కడకు ప్రవేశించాడు* 
*" వ్యాసా ! నువొక్కటే తప్పు చేసావు.* 
*జ్ఞానం గురించి అంతా చెప్పావు గానీ, విజ్ఞానం గురించి చెప్పలేదు. నీవు సిద్దాంతం చెప్పావు. ఆత్మ గురించి చెప్పావు. ఇహలోకం గూర్చి, పరలోకం గూర్చి చెప్పావు. రకరకాల లోకాల్ని గూర్చి చెప్పావు. పురాణాలలో కాలజ్ఞానం గూర్చి చెప్పావు. ఇతిహాసాల గుర్చి చెప్పావు.*
*సాధుల చరిత్ర గూర్చి చెప్పావు.*
 *అంతా చెప్పావు గానీ, ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకున్న  వ్యక్తి ఎలా జీవిస్తాడన్న విషయము నువ్వు చెప్పలేదు. అదే నీ ఆవేదనకు కారణమని చెప్పాడు నారదుడు.*
 
*అప్పుడు భాగవతము రాసాడు వ్యాసుడు.*
*భాగవతమంటే గురుచరిత్రే.*
*రామాయణం కూడా గురుచరిత్రే.*

 *రాముడనే గురువు చరిత్ర.*

*రామాయణ పారాయణ, భాగవత పారాయణ ఎన్ని సత్ఫలితాలిస్తుందో మనకు తెలుసు.*
*అందుచేత గురుచరిత్ర చదవనటువంటి వ్యక్తులు* 
*వ్యాసుడి స్థాయికి చెందిన* *మహర్షులు అయినప్పటికీ* *వారికి ఆత్మ జ్ఞానం లభించిందని లోకం ఒప్పుకోదు.*

*వ్యాసుడి కొడుకు దారి వెంట వెళుతుంటే పక్కన నదిలో స్నానం చేస్తున్న స్త్రీలు ఎంతమాత్రం సిగ్గుపడకుండా ఆలాగే స్నానం చేశారు. అదే వ్యాసుడు వెళుతుంటే వాళ్లంతా సిగ్గుపడి దాక్కున్నారు.*
 *దాంతో ఆ మహారుషికి ఆగ్రహం వచ్చి* 
*" ఓసి దద్దమ్మలారా !*
*మీ కసలు బుద్ధి వుందా ?* *పదహారేళ్ళ నా కొడుకు ఈ దారిన వెళితే మీకు సిగ్గువేయలేదు.*
*వయో వృద్ధుడైన నన్ను చూసి సిగ్గుపడతారేంటి ?*
*అని గద్దించాడు. దానికి ఆ స్త్రీలు స్పందిస్తూ " మీకు ఆత్మ గురుంచి చాలా సిద్ధాంతాలు తెలుసుగానీ ఆత్మ జ్ఞానం లేదు.* 

*కానీ మీ కుమారుడు మాత్రం ఆత్మజ్ఞాని. ఆయన స్త్రీ, పురుష భేదాలు లేని అలౌకిక స్థితికి చేరుకొన్నాడు. అందుకే ఆయన ఎదుట మేము సిగ్గుపడలేదు " అని సమాధానమిచ్చారు.*
*కాబట్టి నిన్ను నీవు ఒక ఆత్మలాగా భావించుకొంటే, ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం అంతా నీ దగ్గరకే వస్తుంది.*
 
*మీరు వ్యాసుడి భాగవతాన్ని చదివి ఉన్నట్లయితే, శ్రీకృష్ణుడు చేసిన ప్రతీలీలా సంఘటనా మీకు షిర్డి సాయి చరిత్రలో కనిపిస్తుంది.* 

*షిర్డి సాయి చేతనత్వానికి, శ్రీకృష్ణుడి చేతనత్వానికి ఏవిధమైన తేడా లేదు.*

   ( పత్రికా సేకరణ ).

No comments:

Post a Comment