*శ్రీ రామచంద్ర అత్మారాం తర్ఖడ్ ( శ్రీ సాయి సచ్చరిత్ర -9 వ అధ్యాయము ) ఒక పెద్ద కంపెనీలో అధికారిగా ఉండేవాడు.*
*అతడు ప్రార్ధనా సమాజమునకు చెందినవాడైనా బాబా సన్నిధితో ఎంతో అధ్యాత్మికంగా ఎదిగాడు.*
*బాబా మహాసమాధి చెందిన కొన్నాళ్లకు, అతను తరచుగా " మిర్చి బాబా " గా పిలవబడే " మాధవదాసు " అనే సిద్ధయోగి వద్దకి వెళ్తుండేవాడు.*
*ఆయన మహరాష్ట్ర లో, కనకేశ్వర్ అనే పట్టణంలో ఉండేవాడు.*
*ఆయన 12 సంవత్సరాలు కేవలం మిరపకాయలు ఆహారముగా స్వీకరించి తపసు చేసాడు.*
*అందుకే అయనను " మిర్చీబాబా " అని ప్రజలు పిలిచేవారు.*
*ఒకసారి రామచంద్ర తర్ఖడ్ మిర్చీబాబా వద్దకి వెళ్ళి, ఆయన సన్నిధిలో వుండగా, ఒక మహిళా భక్తురాలు వచ్చింది.*
*వెంటనే మిర్చీబాబా తనుకూడా మహిళగా మారిపోయాడు.*
*ఇది అత్మారాం ప్రత్యక్షంగా చూశాడు.*
*మిర్చీబాబా స్త్రీ రూపముతోనే ఆ మహిళాభక్తురాలుతో సంభాషణ జరిపారు.* *కొంతసేపు తరువాత ఆ భక్తురాలు వెళ్ళిపోయింది.*
*మరికొంతసేపటికి మిర్చీబాబా మమూలుగా తన పురుషరూపంలోకి వచ్చాడు.*
*ఆ సంఘటన చూసి తర్ఖడ్ ఎంతో ఆశ్చర్యం పొందాడు.*
*అతడు మిర్చీబాబాతో "ఇదంతా ఎలా సంభవం అయినది ?" అని ప్రశ్నించగా, మిర్చీబాబా తన కాలు తొడవద్ద గల ఒక కండరాన్ని లాగితే తాను పురుషరూపాన్ని నుంచి స్త్రీ రూపంగా మారిపోతానని చెప్పాడు.*
*అదివిన్న తర్ఖడ్ తన గురువైన షిర్డీ సాయిబాబా చేసిన ఖండయోగ పక్రియ చెప్పాడు.*
*అందుకు సమర్థ సద్గురువైన శిరిడీ సాయిబాబా లాంటి వారికే సాధ్యపడుతుందని, అది తనకు ఈ జన్మలో అసాధ్యమని తర్ఖడ్ కు తెలిపాడు.*
*పరమ యోగిపుంగవునిగా పేరుగాంచిన మిర్చీబాబాకు కూడా అసాధ్యమైన ఖండయోగాన్ని శ్రీ సాయిబాబా తన బాల్యమునుండే చేసేవారు.*
*అందుకే ఆయన యోగులకే యోగి, యోగి సామ్రాట్. అందుకే మనం యోగిరాజా, అని పిలుస్తాము*
*ఆయన భక్తులు కావడం మన పూర్వజన్మ సుకృతం.*
No comments:
Post a Comment