*సాయిబాబా మహాసమాధి చెందకపూర్వము అయనను ప్రత్యక్షంగా సేవించిన ఎందరెందరో ఆయన అందాలను, ఆయన చేష్టలలోని సౌందర్యాన్ని వర్ణించారు.*
*గణేశ శ్రీకృష్ణ కపర్డే "సాయిబాబా తన మోమును మృదుమధుర మందహాసాలొలికిస్తూ చూపారు.*
*అలాంటి మందహాసం ఒక్కసారైనా సరే చూడటం కోసం ఈ షిరిడీలో ఎన్ని సంవత్సరాలయినా పడి ఉండవచ్చు.*
*నేను పారవశ్యంతో పిచ్చివాడిలా అలాగే చూస్తూ ఉండిపొయాను " అని రాశారు.*
*మోరేశ్వర వామన్ ప్రధాన్*
*" సాయి మహరాజ్ ముఖం, కాళ్ళు కడుగుకొనే విధానము చూసి తీరాల్సిందే తప్ప మాటలలో వివరించలేను.*
*అదొక అందమైన దృశ్యం. ఆ చేష్టలు చాలా దివ్యంగా ఉండేవి.*
*ఆయన స్నానం చేసే విధానము కూడా అంతే " అని వర్ణించారు.*
*సాయిబాబా మహ సమాధి చెందడంతో సాయిబాబా సౌందర్య లహరులు అదృశ్యమయ్యాయి.*
*సాయిబాబా మహా సమాధి అనంతరం, చావడిలో గుప్తరూపంలొ, మశీదులో బ్రహ్మ రూపంలో, సమాధి మందిరములో సమాధి అవస్థలో, సర్వత్రా పరమాత్మ స్వరూపంలో ఉంటారని సాయిసచ్చరిత్ర గ్రంథాన్ని రచించిన హేమాడ్ పంత్ తన గ్రంథంలో తెలిపాడు.*
No comments:
Post a Comment