Thursday, May 16, 2024

యజ్ఞ యాగాదులు చేయలేనివారు కేవలం భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు.* *ఏ నామాన్ని స్మరించాలి ?*

 *యజ్ఞ యాగాదులు చేయలేనివారు కేవలం భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు.*


*ఏ నామాన్ని స్మరించాలి ?*

 

*ఈశ్వరుని నామాలు అనంతాలు. ఆయన అనంతుడు. "సహస్రనామాలు "అంటాము మన సౌలభ్యం కోసం. దైవగుణాలు వర్ణించేవి ఆ నామాలు. స్వామి లీలలు తెలియచేసే అర్ధాలు గల పదాలు అవన్నీ.*


 *సకల లోకాలలో వసిస్తాడు కాబట్టి "వాసుదేవుడు ".* *విశ్వమంతా వ్యాపించి ఉంటాడు కాబట్టి* 

 *"విష్ణువు ".* 

*వామన అవతారంలో ముజ్జగాలు ఆక్రమించాడు కాబట్టి "త్రివిక్రముడు ".* *"నరసింహుడు "అనగానే ప్రహ్లాదుని భక్తి తత్పరత గుర్తుకువస్తుంది.*


*ఒకొక్క నామంతో అనేక పురాణ పవిత్ర గాథలు ముడిపడి వున్నాయి.*

*వాటిని తలచుకోగానే భక్తీ ప్రపూర్ణము అవుతుంది.*


*మన విశ్వాసాలను అనుసరించి, ఇష్టమయిన ఏ భగవానామన్నైనా జపించవచ్చు.* 


*అకాశం నుంచి భుమిపై పడే నీరు వివిధ నామాలు గల నదీ నదాల ద్వారా సముద్రాన్ని చేరుతుంది.*

*భక్తితో ఏ నామాన్ని స్మరించినా అది కేశవుడికే చెందుతుంది.*


*వివిధ నామాలతో తనను పిలుస్తున్న అందరినీ స్వామి సమరస దృష్టితోనే చూస్తాడు.*

 *ఆయన కరుణా స్వభావం తండ్రి వంటిది. తండ్రి తన బిడ్డలను సమముగా భావిస్తాడు. ఒక్క పిలుపుతో పలికే స్వామి పదే పదే తన నామస్మరణ గావించేవారిని ఉపేక్షిస్తాడా ?*

*ఆవులించినా, తుమ్మినా, దైవ నామ స్మరణం చేయడం ఒక సాంప్రదాయం. భోజనానికీ ముందూ వెనుకా గోవింద నామ స్మరణ చేస్తుంటారు.* 

*తమ సంతానానికి దైవ నామాలు పెట్టడము ఒక ప్రాచీన ఆచారం.*


*దైవనామాలే పవిత్ర మంత్రాలు.* 

*నారదుడు ధ్రువుడుకి "ఓం నమో భగవతే వాసుదేవాయ"  అనే ద్వాదశాక్షరీ మంత్రం ఉపదేశించాడు.*


*మహార్షులు వాల్మీకి కి "రామ " అనే తారక మంత్రాన్ని ఉపదేశించారు.*

*"నమఃశివాయ" పంచాక్షరీ తారకనామాన్ని జపిస్తూ పోతన, రామదాసు, త్యాగయ్య లాంటి ముక్తిని పొందారు.*

 

*"హేరామ్ " అంటూ మహాత్ముడు ఇహలోకం విడిచాడు.*


*సహస్రాధిక నామాలు గల ఈశ్వరుడి పేర్లలో ఏది శ్రేష్టం ?"*


 *ఓం "అనే ప్రణవం శ్రేష్టం అని వేదం తెలిపింది.* 


*కాబట్టే ఏ నామానికి అయినా ముందు "ఓం " చేర్చి స్మరించడం భక్తికీ ముక్తికీ సులభసాధనమైన నామస్మరణం కలియుగంలో సర్వసమాదరణీయం.*

No comments:

Post a Comment