Thursday, May 16, 2024

సాయిబాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ విశ్వనాధ్ దేవ్ కు జ్ఞానేశ్వర మహరాజ్ రచించిన " జ్ఞానేశ్వరి " గ్రంథాన్ని పారాయణం చేయాలనీ కోరిక ఉండేది.* *సాయిబాబా ఆయన కోరిక మన్నించారు

 *సాయిబాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ విశ్వనాధ్ దేవ్ కు జ్ఞానేశ్వర మహరాజ్ రచించిన " జ్ఞానేశ్వరి " గ్రంథాన్ని పారాయణం చేయాలనీ కోరిక ఉండేది.*

*సాయిబాబా ఆయన కోరిక మన్నించారు.*

 *దేవ్ జ్ఞానేశ్వరి పారాయణ ప్రారంభించాడు.*

*బాబా అయనకు స్వప్నములో కనిపించి " గ్రంథం పారాయణ చేస్తున్నావు కదా, గ్రంథం అర్ధమవుతుందా ? " అని ప్రశ్నించాడు.*

*"లేదు " అని దేవ్ అని జవాబిచ్చాడు."* 

*గ్రంథం చదివేటప్పుడు నీవు చాలా తొందరపడుచున్నావు ఏదీ, నా దగ్గర కూర్చోని చదువు " అని బాబా చెప్పారు.*

*దేవ్ పారాయణలో తాను చేసే పొరపాటును గుర్తించాడు.*

*బాబా సూచనను గ్రహించి, బాబా సలహాను పాటించాడు.*


*అధ్యాత్మిక మార్గములో పయనించే ప్రతీ ఒక్కరికీ బాబా మాటలు వర్తిస్తాయి.*


*ఉదాహరణకి : పారాయణం చేయడం ఒక కార్యక్రమముగా పెట్టుకున్నప్పుడు, ఆ రోజు చేయవలిసినా నిత్య పారాయణం తొందరగా పూర్తిచేయడానికి ప్రయత్నించరాదు.* 

*చదివే ప్రతీ పంక్తిని అర్థం చేసుకుని ముందుకి సాగాలి.*

*తొందరగా పారాయణం ముగుంచుకుని, వేరే పనికి ఉపక్రమించుదామని ఆలోచన మనసులోకి రాకూడదు.*

*పారాయణ సమయములో మనసునిండా సాయినాధుడే కొలువుండాలి.*

*అది సాయిబాబా దేవ్ కు చెప్పిన పలుకులలో అర్థం.*

No comments:

Post a Comment