*" ఓం శ్రీ వేంకటేశ రమణా య నమః "*
*శ్రీ సాయినాథ అష్టోత్తర నామావళి 99 వ నామం,*
*" కలౌ వెంకటేశ " అని ప్రసిద్ధముగా చెప్పుదురు.*
*ఈ కలికాలమున వెంకటేశ్వరుడే దేవుడని అర్థము భక్తులు ఆయనను బాలాత్రిపురసుందరి అను భావముతో " బాలాజీ " అని పిలచి అరాధించెదరు.*
*కొందరు ఈశ్వరుడన్న భావముతో అరాధించెదరు.*
*కొందరు ఏడుకొండలవాడు, పంగ నామాలవాడని విష్ణువుగా భావించి పూజించెదరు.*
*ఆయనకు వడ్డికాసులవాడు అని మరొక పేరు గలదు ఆయన అప్పును వడ్డీతో సహా వసూలు చేయునట.*
*తిరుమల వెంకటేశ్వర స్వామి ఏవిధముగా భక్తుల అభీష్టములును తీర్చుచున్నాడో, షిర్డీ గ్రామమునందు వెలిసిన సాయిబాబా కూడా అదేవిధముగా భక్తుల కోరికలు నెరవేర్చుచున్నాడు.*
*అంతేగాక సాయిబాబా ఆపదలలో ఉన్నవారిని ఆదుకొని*
*" ఆపదమొక్కులవాడు " అని బిరుదు నామమును గడించుకొనెను.*
*శ్రీ షిర్డీ సాయిబాబా కూడా ఆపదలలో ఉన్నవారు ఆర్తులై పిలిచినచో ఆదుకొని రక్షించును అన్న విషయము చెప్పుకొంటిమి.*
*ఆశ్రీతులను ఓదార్చువాడు, కష్టములను తీర్చువాడు, సంపదలను అందించువాడు కూడా సాయినాధుడే.*
*వెంకటేశ్వరస్వామి వలెనే శ్రీ సాయిబాబా భక్తుల హృదయాలలో ఉండి, వారిని రమింపచేయును.*
*ఆనందింపచేయును.*
*కావున సాయినాధుడు వేంకటేశ రమణ అన్న నామమును గడించుకొని ఉన్నాడు.*
No comments:
Post a Comment