Tuesday, May 14, 2024

పాండురంగ హరి, జై జై రామకృష్ణ హరి, పాండురంగ హరి, జై జై వాసుదేవ హరి "* *మహరాష్ట్రలో నిత్యమూ ఈ పాండురంగ నామాన్ని మంత్రముగా భక్తులు జపిస్తుంటారు.

 *" పాండురంగ హరి, జై జై రామకృష్ణ హరి, పాండురంగ హరి, జై జై వాసుదేవ హరి "*


*మహరాష్ట్రలో నిత్యమూ ఈ పాండురంగ నామాన్ని మంత్రముగా భక్తులు జపిస్తుంటారు.*


*మహరాష్ట్రలో, పాండురంగ భక్తి ( వార్కరీ సంప్రదాయానికి ఆద్యులు* *శ్రీ జ్ఞానేశ్వర మహరాజ్ ఈ సాంప్రదాయాన్ని విస్తరించినవారిలో, నామదేవ్,* 

*సంత్ శ్రేష్ఠ తుకారాం మున్నగువారు.* 


*షిర్డి సాయిబాబాకు ఇచ్చే కాకడ హారతి, శేజ్ హరతులలో తుకారాం మహరాజ్, నామదేవ్, జానాబాయి మున్నగు పాండురంగ భక్తులు రచించిన అభంగాలు పాడుకుంటున్నాము.* 


*కాకడ హారతి తుకారాం అభంగంతో ప్రారంభమై, శేజ్ హారతి తుకారాం అభంగంతో ముగింపుకు వస్తుంది.*


*వీరిలో తుకారాం మహరాజ్ రచించిన అభంగాలు శేజ్ హరతిలో భక్తులు పాడినప్పుడు, సాయిబాబా రెండు చేతులు జోడించి నమస్కరించేవారు.‌ అది బాబాకు వారియందుగల ప్రేమ, గౌరవం.* 


*తుకారాం మహరాజ్ నిత్యమూ పాండురంగ స్మరణతో గడిపేవారు.* *ఆయన భక్తి చూసి ఆ రోజులలో మహరాష్ట్ర దేశాన్ని పరిపాలించే ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆయన శిష్యుడైనాడు.* 


*శ్రీ తుకారాం మహరాజ్ జీవించింది 40 సం గానీ 50 సం అయి ఉండవచ్చు.* *ఆయన జన్మించినది పూణే నగరానికి 35 కి.మీ. దూరములోనున్న " దేహు " అను గ్రామం.*


*ఆయన భక్తికి పాండురంగడు మెచ్చి, ఆయన రచించిన అభంగాలు విని ఆనందించేవారు.*


*1650 సం. ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష విదియనాడు, ( నేటి రోజున ) ఆనేకమంది భక్త సమూహం చూస్తుండగా, విష్ణువుకు వాహనమైన గరుడ వాహనంలో, శ్రీ మహావిష్ణువు కోరిక మన్నించి సజీవ దేహం తో మధ్యాన్నం 12 గం. లకు వైకుంఠ గమనం జరిగింది.* 


*ఇప్పటికీ తుకారాం మహరాజ్ వైకుంఠ గమనం చేసిన ఫాల్గుణ కృష్ణ విదియనాడు, లక్షలాదిమంది భక్తులు దేహు గ్రామాన్నీ దర్శించి తుకారం మహరాజ్  కు రంగరంగ వైభవంగా పూజార్చనలు చేస్తారు.* 


*నేటికీ దేహు గ్రామంలో తుకారాం మహరాజ్ వైకుంఠ గమనం చేసిన ఫాల్గుణ మాస కృష్ణ విదియ తిధినాడు, వైకుంఠగమనం చేసిన ప్రదేశంలో గల చెట్టు, సుమారు మధ్యాన్నం 12 గంటలకు కొన్ని నిముషాలు అటు ఇటూ ఊగుతుంది.*

*(కదులుతుంది)*

*దేహు గ్రామం లో ఇది ప్రత్యక్ష నిదర్శనం.*


*ప్రతి సంవత్సారం తుకారాం మహరాజ్ ఆ రోజున వైకుంఠం నుండి దేహు గ్రామాన్ని దర్శిస్తారని భక్తుల విశ్వాసం.*


*సంత్ శ్రేష్ఠ తుకారాం మహరాజ్ కి జై*

No comments:

Post a Comment