10-05-2024, వీరశైవ మత స్థాపకుడు, గొప్ప సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వరుని 890వ జయంతి.*
*కుక్కపాలు పంచామృతానికి ఉపయోగపడనట్లే, పాపాత్ముని డబ్బు మంచిపనులకు పనికిరాదు.*
*పరులను ద్వేషించక, పరుల వస్తువులను అపహరించక, పరుల మనసును బాధించక, అబద్దాలు ఆడకుండా, ప్రశంసలకు దూరంగా ఉన్నపుడే అంతరంగం పరిశుద్ధమవుతుంది.*
*పరమాత్మ మనలను అనుగ్రహించడానికి ఇది చక్కని రాజమార్గం.*
*దేవలోకం, మర్త్యలోకం వేరుగా లేవు. సత్యం పలకడమే దేవలోకం. అసత్యం పలకడమే మర్త్యలోకం.*
*మనం పలికే ప్రతీ మాటలో పరమాత్మ నామామృతం నిండి ఉండాలి.*
*లక్కతో చేసిన విగ్రహం కరిగిపొతుంది. కట్టెతో చేసిన బొమ్మ విరిగిపోతుంది.*
*ఆలయము కట్టించలేదని బాధపడనవసరం లేదు.*
*హృదయమే గర్భగుడి.*
*శిరస్సే బంగారు కలశం.*
*పరమాత్మ మన హృదయాకాశంలో అంతర్యామిగా ఉన్నాడని తెలుసుకొవడమే భక్తి.*
*ఇలాంటి బోధనలతో పన్నెండవ శతాబ్దికి చెందిన బసవేశ్వరుడు, వీరశైవ మత స్థాపకుడిగా పేరుగాంచాడు.*
*బసవామృతం - నీటిలో నిప్పులాగా, పండ్లలో రసంలాగా, పూలలో పరిమళంలాగా పరమాత్మ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు.*
*అతడునిర్గుణుడు, నిరాకారుడు,చావు పుట్టుకలు లేనివాడనీ గట్టిగా నమ్ముతారు.*
*అంకుశం చిన్నదైనా అది ఏనుగు కంటే బలమైనది.*
*వజ్రం చిన్నదైనా అది పర్వతం కంటే శక్తివంతమైనది.*
*ఆలాగే పరమాత్మను ధ్యానించే మనసు చిన్నదైనా అది మహత్తరమైంది.*
*మాయ మనిషిని ఆవరించి ఉంటుంది.అది జన్మకు తల్లి. మోహానికి బిడ్డ. మనిషిని అన్నివిధాలా ఆడించేది మాయే. మాయను గెలవడం ఎంతో కష్టం.*
*ఒక్క పరమాత్మకు మాత్రమే మాయను పోగొట్టుట సాధ్యమవుతుంది.*
*చెప్పేది ఒకటి, చేసేదీ ఒకటి అయితే మనిషిలో పవిత్రత లేనట్లే.*
*చెప్పిన మాటకు కట్టుబడి పనులాచరించే వారినే పరమాత్మమెచ్చుకొంటాడు.*
*ఈలోకం పరమాత్మ సృష్టించి ఇచ్చిన ఒక కర్మాగారం. మనమంతా కార్మికులం.*
*మంచిపనులు చేసినప్పుడే సృష్టికర్త మెప్పు పొందగలం.*
*మనం కొన్ని సందర్భాలలో పాముకు పాలు పోస్తాము. కానీ అవి నిజంగా కనిపిస్తే చంపుతాము.*
*పాపమంటే ఇదే.*
*లింగానికి నైవేద్యము పెట్టడము కంటే, మన ఇంటిముందు నిలబడ్డ జంగమయ్యకు అన్నం పెట్టాలి.*
*పుణ్యం అంటే అదే.*
No comments:
Post a Comment