*షిరిడీలో జరిగిన మొదటి శ్రీరామనవమి.*
*మొదటిసారిగా శ్రీ రామనవమి ఉత్సవం 1911 సం .లో షిరిడీలో సాయినాథుని సన్నిధిలో భక్తులచే జరుపబడినది.*
*అనగా రామ జన్మోత్సవం జరుపబడినది.*
*సాయిబాబా అవతార కార్యక్రమం హిందూ ముస్లిం సమైక్యత.*
*1897 సం. లో శ్రీరామ నవమినాడు మొదటి సారిగా ఉరుసు ఉత్సవాన్ని బాబా ద్వారకా మాయిలో ప్రారంభింప చేశారు.*
*అదే పునాది.*
*సాయిబాబా ముస్లింగా కనిపించినా మద్రాసు భజన సమాజ్ మహిళ అరుంధతీ అమ్మాళ్ కు రామునిగా సాక్షత్కరించాడు .*
*రామభక్తుడైన డాక్టరు కు రామునిగా దర్శనమిచ్చాడు.*
*భక్తులకు భావార్థ రామాయణం, ఆధ్యాత్మ రామాయణము, పారాయణము చేయమని అదేశించారు.*
*బాబా మహసమాధికి ముందు తాను స్వయముగా వజే అను భక్తునితో రామవిజయం అను గ్రంథాన్ని మూడుసార్లు పారాయణ చేయించుకున్నారు.*
*ఉపాసనీ మహరాజ్ తాను రచించిన " సాయినాథ మహిమ స్తోత్రం " లో సాయిరూప ధర రాఘవోత్తమం అని కీర్తింపబడినాడు.*
*ఈ కలియుగములొ ఆ శ్రీరాముడే సాయిరాముడై అందరినీ అనుగ్రహిస్తున్నారు.*
*సాయి గురు బంధులందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.*
*జై సాయిరామ్.*
No comments:
Post a Comment