*సాయిబాబా తన మహిమలను చాటుకోవడానికి కాకుండా, తన భక్తుల ఈతి బాధలను తీసివేయడానికి స్వప్న దర్శనాలను ప్రసాదించారు.*
*భక్తుడైన గోవింద భావు విషయంలో అతనిని నీతిపరునిగా చేయుటకు స్వప్న దర్శనమిచ్చారు.*
*భక్తులలో భక్తి భావాన్ని పెంపొందించ చేయడానికి స్వప్న దర్శనాలు ఇచ్చారు.*
*ఒకసారి బాబా రామచంద్ర వాసుదేవ గైసాస్ అనే భక్తునికి స్వప్నంలో కనిపించి "నీవు 53 నాకు భిక్షగా ఇవ్వు" అని అడిగారు.*
*తాను పేదవాడిని కాబట్టి 53 రూపాయలు కాకుండా 53 కాసులు (అప్పట్లో రూపాయలో 64 వంతు రాగి నాణేలు ) సమర్పించ మన్నారని భావించి 53 కాసులను సమర్పించాడు.*
*సాయి భావము అది కాదని, 53 అధ్యాయముల ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని అర్థం అని హేమాడ్ పంత్ చెప్పగా గైసాస్ ఆ గ్రంథాన్ని పారాయణ చేశాడు.*
*ఇంకా తన భక్తుడైన సాఠేకు, బాబా గురుచరిత్ర చేత పట్టుకుని దానిలోని విషయాలను బోధ పరుచునట్లు చేశారు.*
*ఈ విషయము సాఠే, కాకాసాబ్ దీక్షిత్ ను అడుగగా, బాబా దానిని మరొక్కసారి పారాయణ చేయమన్నారని తెలిపాడు.*
*సాయి సచ్చరిత్ర గ్రంథ కర్త అయిన శ్రీ హేమాడ్ పంత్, మరొక సాయి భక్తుడైన శ్రీ బి .వి .దేవ్ కు ఏప్రియల్ 2 వ తేదీ 1914 సం. న స్వప్నంలో బాబా సాక్షాత్కరించారని వ్రాశాడు.*
*లోగడ అతనికి సాయిబాబా జ్ఞానేశ్వర మహరాజ్ రచించిన "జ్ఞానేశ్వరి "గ్రంథాన్ని పారాయణ చేయమని అదేశించారు.*
*ఆ ఆదేశం ప్రకారం బి .వి .దేవ్ గ్రంథ పారాయణ ప్రారంభించాడు.*
*అతనికి ఏప్రియల్ 2 -1914 సం .న బాబా స్వప్నంలో కనిపించి "జ్ఞానేశ్వరి "(భగవద్గీతకు జ్ఞానేశ్వర మహరాజ్ వ్యాఖ్యాన గ్రంథం ) బోధపడుచున్నదా ? లేదా " అని ప్రశ్నించారు.*
*దేవు "లేదు బాబా " అని జవాబిచ్చాడు.*
*మరల బాబా " ఇంకా ఎప్పుడు తెలిసికొనెదవు ?అని అన్నారు.*
*బి .వి .కన్నీరు కారుస్తూ" బాబా !నీ కృప వర్షించనిదే బోధపడుట కష్టంగా ఉన్నది" అని అన్నాడు.*
*అందుకు సాయి "చదువుతున్నపుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువు. నా సమక్షమున చదువు " అని బాబా పలికారు.*
*దీనిని బట్టి సాయి సచ్చరిత్ర గానీ, శ్రీ గురుచరిత్ర గానీ సాయినాధుడు మన ఎదురుగా ఉన్నారనీ, గ్రంథము నెమ్మదిగా పారాయణ చేయవలెనని బి .వి .దేవకే గాక మనఅందరికీ బోధ చేశారు.*
*సేకరణ -సాయి @ 366 గ్రంథం నుండి.*
No comments:
Post a Comment