*ఆనాడు ఈనాడు ఒకే స్పందన.*
*కేరళ లోని కణ్హనఘడ్ ఆనందాశ్రమ స్థాపకుడు స్వామీ రామదాస్.*
*ఆయన సాయిబాబాను సమాధి చెందక పూర్వము దర్శించ లేకపోయారు.*
*బాబా మహాసమాధి అనంతరం 1953 సం .లో షిరిడీని దర్శించారు.*
*ఆయన తన అనుభవాలను*
*25 -4 -1957 తేదీ నాడు ఇలా తెలిపారు.*
*అసలు సాయిబాబా జీవితం విడ్డురం గాను, వింతగానూ ఉంటుంది.* *ఆయన జీవిత చరిత్ర చదివినవారే కాదు, ఆయన భక్తులు కూడా కాదనరు.*
*"ఆయన ఒక మహోన్నత అధ్యాత్మిక శిఖరమని ఈ రామదాసు చెప్పగలడు" అని అంటారు ఆయన.*
*" నేను "అని పదాన్ని ఈ కణ్హన్ ఘడ్ యోగి ఉపయోగించరు.*
*షిర్డీలో సాయి బాబా దర్శనం ఒక భాగ్యమే అని అంటారు.*
*సాయిబాబా కూడా తన భక్తులతో "నీ పూర్వ పుణ్యం ఆధిక్యం వల్ల షిరిడీకి రాగలిగావు " అనేవారు.*
*షిరిడిని దర్శించిన ఎందరో మహనీయులు "సాయినాథుని సమాధి మందిర వాతావరణం ఎంతో అధ్యాత్మిక శాంతి తోను, ఆనందంతోనూ స్పందిస్తూ ఉంటుందని, బాబా సజీవంగా ఉన్నప్పుడు అలాగే ఉండేదని" తెలిపేవారు.*
*అంటే షిరిడీలో సాయి సన్నిధి -సాయి సమాధి చెందక పూర్వము, సమాధి చెందిన తరువాత ఎటువంటి తేడా కనిపించుటలేదు.*
*"సాయిబాబా గారు ఇప్పటికీ షిరిడీ పవిత్ర ప్రదేశంలో సజీవులుగా వున్నట్లు కనిపిస్తుంది "అని అంటారు ఈ స్వామీ రాందాసు.*
*షిరిడీలో ఆయన కంటబడిన ఒక అద్భుత దృశ్యం ఏమిటంటే, బాబా గారి సమాధి దర్శనం కొరకు రోజంతా ఎడతెరిపి లేకుండా వచ్చే భక్త జన ప్రవాహం.*
*స్వామీ రాందాస్ గారు భారత దేశంలో సంచారం చేసిన వివిధ ప్రాంతాలలోను, భక్తుల గృహాలలోనూ సందర్శించినప్పుడు, ప్రతీ చోటా సాయినాథుని ఫొటొ గోడకు అలంకరించి ఉండటం గమనించారు.*
*"షిరిడీ సాయిబాబా అత్యంత జన ప్రియులు. భారత దేశప్రజలే గాక విదేశాలలో కూడా ఆయనకు అత్యంత గౌరవం ఉన్నది.*
*ఆయన పేరు అన్ని గృహాలలోనూ వినిపిస్తూ ఉంటున్నది.*
*శ్రీ సాయిబాబా ఈనాటికీ కూడా, ఆయన మార్గదర్శకత్వాన్ని, ఆశీస్సులను అభిలషించే వారి జీవితాలను మలచి, పరివర్తన కావించే అత్యంత సమర్ధవంతమైన ఒక యోగి మహరాజ్ సమర్థ సద్గురు సామ్రాట్ " అని అంటారు ఈ కణ్హనఘడ్ యోగి రాందాసు.*
*ఆయన చెప్పింది ముమ్మాటికీ నిజం.*
*మనమందరమూ సాయి ని మార్గదర్శిగా నిలవాలని కోరుకొందాం.*
No comments:
Post a Comment