*71 వసంతాలు పూర్తిచేసుకున్న తెలుగులో మొదటిసారిగా అనువదింపబడిన శ్రీ సాయిసచ్చరిత్ర*.
*ది 19 -5 -1953 తేదీ షిర్డి సాయినాథుని సాహిత్యంలో గుర్తుంచుకొనవలిసిన, ఎన్నటికీ మరువలేని సుదినం*
*అది సాయి భక్తులకు పర్వదినం*
*ఆ తేదీవరకు తెలుగు భాషలో సాయినాథుని జీవితచరిత్ర పారాయణ చేయడానికి ఏ గ్రంధమూ రచన జరగలేదు*
*మొదటిసారిగా హేమాడ్ పంత్ అను పిలువబడే గోవింద్ రఘునాధ్ ధబోల్కర్ సాయిసచ్చరిత్రనుమరాఠి భాషలో రచించాడు.దానిని నాగేష్ వాసుదేవ్ గుణాజీ గారు ,ఆంగ్ల భాషలో సంక్షిప్తం గా రచన చేశారు.*
*ఆంగ్ల భాష తెలిసినవారికి మాత్రమే ఆ గ్రంథం పారాయణకు అందుబాటులో ఉండేది*
*ఆ గ్రంథాన్ని తెలుగులో పారాయణ చేయడానికి శ్రీ సాయినాధుడే, తెలుగులో మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వాస్తవ్యులైన శ్రీ ప్రత్తి నారాయణరావు గారిచే అనువదింపబడింపబడినట్లు చేశారు*
*ఆనాటి ఆ పవిత్ర గ్రంథాన్ని ఈనాటివరకు కొన్ని లక్షలమంది తెలుగువారు పారాయణ చేసి ఉంటారు. కొన్ని వందల సామూహిక పారాయణాలు జరిగి ఉంటాయి*
*ముఖ్యముగా షిర్డీ సాయిసంస్థాన్ వారిచే, అన్ని భాషలకన్నాఅధికంగా తెలుగులో కొన్ని లక్షల సాయిసచ్చరిత్ర ప్రతులు ముద్రణ జరిగినది*
*ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయునిగా పేరొందిన శ్రీ ప్రత్తి నారాయణరావుగారు తన ఉద్యోగాన్ని , కుటుంబాన్ని వదలివేసి సాయిభక్తుడైనాడు*
*పగలు రాత్రీ అనక సాయిబాబా ఆయననుశ్రమింపచేసి ఒక పవిత్ర గ్రంథాన్ని రచింపచేసాడు*
*ఆయన ఆ ఒక్క గ్రంథాన్ని రచన చేసి జనన మరణాల వలయాన్ని నుండి తప్పించుకున్నాడు*
*సాయిభక్తులు అతి తక్కువ సాధనతో అంటే ఏ ఇతర సాధనలు అవసరంలేకుండా సచ్చరిత్ర పారాయణతో జన్మపరంపరల నుండి బయటపడే మార్గాన్ని మనకు ఆయన చూపెట్టాడు*
*జన్మపరంపరలను దృష్టిలో ఉంచుకోకపోయినా లౌకిక కోరికలు కూడా అతి తక్కువ శ్రమతో, సచ్చరిత్ర పారాయణతో పొందవచ్చును అని ఆ గ్రంథము ద్వారా తెలియచేయబడినది*
.
*ధర్మ అర్థ కామ మోక్షప్రదమగు "శ్రీ సాయిబాబా జీవితచరిత్ర" అను పారాయణ గ్రంథాన్ని మనకు ప్రసాదించిన శ్రీ ప్రత్తి నారాయణరావు గారి రుణమును తెలుగువారు తీర్చుకొనలేరు.*
*19 -5 -1953 మంగళవారము నాడు ,శ్రీ ప్రత్తినారాయణరావు గారు తెలుగు సాయిసచ్చరిత్ర మొదటి ముద్రణ కాపీలను, షిర్డీలోని సాయి సమాధి పై ఉంచి ప్రార్థన చేసి ఆ గ్రంధరాజమును అందరికీ అందచేసాడు*
*మొదటి ప్రతిని అప్పటి కలకత్తా నివాసి అయిన శ్రీమతి దుక్క లీలగారు అందుకోవటం, ఆమెయే మాతాజీ సాయిలీలమ్మగా ప్రసిద్ధిగాంచారు*
*ప్రత్తి నారాయణరావు గారు మనకు అందించిన "శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథం ",మహమ్మదీయులు కు "ఖురాన్ "పవిత్ర గ్రంథం వలె క్రిష్టియన్లకు "బైబిల్ పరిశుద్ద గ్రంథం "వలె సిక్కులకు "గురుగ్రంధ సాహెబ్" వలె,హిందువుల కు " భగవద్గీత" వలె ప్రపంచవ్యాప్తంగా సాయిభక్తుల లౌకిక పారమార్ధిక కోరికలు నెరవేరుచున్న ఆ పవిత్ర గ్రంథాన్ని అందించిన శ్రీ ప్రత్తి నారాయణరావు ధన్యుడు*
*చిర స్మరణీయుడు*
No comments:
Post a Comment