Wednesday, May 15, 2024

పూజాతంతు ఒక బాహ్య ప్రక్రియ.* *భక్తి అందులో అనివార్యంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక పరిమళం.*

 *పూజాతంతు ఒక బాహ్య ప్రక్రియ.*


*భక్తి అందులో అనివార్యంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక పరిమళం.*


*భగవంతుడు మనం సమర్పించే వాటిలో దేన్నీ ఆరగించకపోవడం మనం చూస్తూనే ఉన్నాం.*


*కానీ, ఆయన భక్తి అనే ఫలాన్ని ఆప్యాయముగా స్వీకరిస్తుంటాడని మనం గ్రహించలేకపోతున్నాం.*


*భక్తికి మూడు దశలుంటాయి.*


*పువ్వు - కాయ - ఫలం.*


*పువ్వుగా పరిమళిస్తుంది.*

*కాయగా ధృడపడుతుంది.*

*పండుగా పరమాత్మ కైంకర్యానికి అర్హత పొందుతుంది.*


*ఈ మూడో దశకు  చేరుకోవాలంటే కొందరికీ జీవితకాలం పట్టవచ్చు.*

*అదృష్టవంతులు ఏకాగ్రతతో అత్యల్పకాలంలో సాధించవచ్చు.*

*అసలు మందుగా భక్తి అంటే  ఏమిటో, దాన్ని ఎలా సొంతం చేసుకోవాలో మనకు తెలియాలి.*

*అందుకు వేషభాషల అవసరం ఉండదు.*


*కేవలం అపార విశ్వాసం, అనంతమైన ప్రేమ, స్థిరబుద్ధి.*

*వీటిని ఆశ్రయిస్తే - భక్తి మార్గం మన ఎదుట సాక్షాత్కరిస్తుంది.*


*సముద్రాలను సృష్టించిన పరమాత్మ కేవలం ఉద్ధరిణి నీటితో ఆనందిస్తాడు.*

*ఏకతర్పణతో తృప్తిపడతాడు.*


*సకల జీవరాశులకు ఆహారాన్ని ఏర్పాటుచేసిన చిదానందుడు చింతాకంత నైవేద్యంతో సంతృప్తి చెందుతాడు.*


*అక్షయపాత్రలోని ఒక్క మెతుకుతోనే తన స్వభావాన్ని వ్యక్తం చేస్తూ పరమాన్నంగా స్వీకరించిన సర్వేశ్వరుడుకు మనం ఏమిచ్చి ఆనందింపచేయాలి ?పరమాత్మకు మనం ఇవ్వాల్సినవి ప్రాపంచిక వస్తువులు కానే కాదు.*

*ఏ వస్తువూ భక్తి కన్నా గొప్పది కాదు.*


*కాబట్టి కేవలం మనం భక్తిఫలాన్ని అయనకు సమర్పించుకొందాం.*

*అప్పుడు ఆధ్యాత్మిక ఆడంబరాలతో మనకు అవసరం ఉండదు.*

No comments:

Post a Comment