Thursday, May 16, 2024

శ్రీసాయినాధ అష్టోత్తర శతనామావళి.* *" ఓం భక్త పరాధీనయ నమః ."* *పరమాత్ముఁడు భక్త పరాధీనుడు.*

 *శ్రీసాయినాధ అష్టోత్తర శతనామావళి.*


*" ఓం భక్త పరాధీనయ నమః ."*


*పరమాత్ముఁడు భక్త పరాధీనుడు.*


*భక్తుడు శ్రద్దా విశ్వసాలతో "స్వామీ " అని పిలిస్తే, ఆయన " ఎమీ అని రాకతప్పదు.*

 *అల వైకుంఠ పురములో ఉన్న గజాననుడు మనసారా శివుని కొలిచాడు. వరం కోరుకోమన్న శివుని తన గుండెలలో ఉండి పోమన్నాడు.* 

*అంతే ! శివుడు అతని గుండెలో ఉండిపోయాడు.* 


*పాండురంగడు పుండరీకుని భక్తి శ్రద్ధలకు మెచ్చి ప్రత్యక్షమయ్యడు* 


*పుండరీకుడు తన తల్లితండ్రుల సేవ పూర్తి అయ్యేవరకు, స్వామిని నిలిచి ఉండమని ఒక ఇటుక రాయి చూపించాడు.*

*ఇక పాండురంగనికి పుండరీకుని అభ్యర్ధన మన్నించక తప్పలేదు.*

*ఆ ఇటుకరాయి మీదే కటి హస్తుడై ఆలాగే నిలిచిపొయాడు.*


*నాటికీ నేటికీ.*

 *మరి సాయిబాబా సంగతి కూడా అంతే ! భక్తితో, ప్రేమతో తాత్యాకోతే పాటిల్ ఆయన చేత సాధికారికంగా కఫనీలను మార్పించేవాడు. జలతారు సెల్లాలు కప్పేవాడు.*

*బాబా అతని ప్రేమకు లొంగి ఊరుకొనేవాడు.*


*అభిషేకాలూ వగైరా ఉపచారాలు బాబాకు నచ్చేవి కావు.*

*అయినాసరే మేఘశ్యాముని భక్తీ కి లొంగిపోయి గోదావరి నీటితో, అభిషేకము చేస్తుంటే కూర్చోని నీళ్లన్నీ పోయించుకొన్నాడు.*


*అలాంటి భక్త పరాధీనునికి ఇవే భక్తి పూర్వక ప్రణామములు.*

No comments:

Post a Comment