Thursday, May 16, 2024

సాయిబాబా వలె గొలగమూడి వెంకయ్య స్వామిగారు " అన్ని జీవులలోనూ వెంకయ్య (నేను ) ఉన్నాడని రాసుకో " అని అనేవారు.* *అంతేకాదు సాయిబాబా వలె అనుభవలిచ్చారు. ఇద్దరికి అనేక పోలికలున్నాయి

 *" నేను మీ శరీరంలోనే ఉన్నాను.*

*ఎల్లప్పుడూ మీ హృదయములోనూ, సర్వ జన హృదయాలలోను గల నన్ను పూజించండి " అని చెప్పేవారు శ్రీ షిర్డీ సాయిబాబా.*


*నాగుల వెల్లటూరులో పెంచలయ్యకు జన్మించిన వెంకయ్యస్వామి చివరకి గోలగమూడిలో స్థిరపడ్డారు. సాయిబాబా వలె ఆయన జన్మదినం, సంవత్సరం తెలియవు.*


*సాయిబాబా వలె గొలగమూడి వెంకయ్య స్వామిగారు " అన్ని జీవులలోనూ వెంకయ్య (నేను ) ఉన్నాడని రాసుకో " అని అనేవారు.*


*అంతేకాదు సాయిబాబా వలె అనుభవలిచ్చారు. ఇద్దరికి అనేక పోలికలున్నాయి.*

 *ఇద్దరూ అగ్ని గుండాన్ని వుంచారు.*

*సాయిబాబా తన ధునిని కేవలం షిరిడీలో ద్వారకామాయిలో ప్రజ్వలింప చేసారు. అది అక్కడనే వుంది నాటినుండి నేటివరకు.* 


*సాయిబాబా గూర్చి ఎక్కువగా తెలియని రోజులలో, ఆ ప్రాంతంలో " అయ్యా ఉత్తరాదిన మన అన్నగారు ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడూ అగ్ని గుండం వెలిగిస్తారు " అని వెంకయ్యస్వామి అనేవారు.*


*బాబా విజయానందుడనే సన్యాసితో " వాడాలో ఆనేకమంది దొంగలున్నారు. తలపులు గడియలు వేయుము. జాగ్రత్తగా ఉండుము.*


*దొంగలు అంతయూ తీసుకొనిపోయెదరు " అని పలికి హెచ్చరించారు.*

*ఇక్కడ దొంగలంటే భౌతికంగా దొంగ మనుషుల కాదు.*


*మనసులో కలిగే దురాలోచనలు.*

*దురాలోచనలు మనసులో చొరబడకుండా ఎప్పటికపుడు చూసుకొంటూ ఉండాలి అని బాబా సందేశము.*

*అలాగే వెంకయ్యస్వామిగారు " అందరికీ పంట పండించాను.*

*దాన్ని దొంగలు పడి దోచుకొకుండా చూసుకోండి " అని అనేవారు.*


*మనలోని దుర్గుణాలను కంటే దొంగలు ఉండరు.*

*ఒక దుర్మార్గపు ఆలోచన కలిగిందా చేసుకున్న పుణ్యమంతా కరిగిపోతుంది.*


 *సాయిబాబా తర్కడ్ భార్యతో " తల్లీ ! నాకు కడుపునిండా గొంతువరకు భోజనము పెట్టినావు. యెల్లప్పుడూ ఇటులనే చేయుము.*

*ఇది నీకు సద్గతి కలుగ చేయును "అని ఆన్నారు.*


*ఇంతకూ ఆమె ఒక పందికి, కుక్కకు తాను తింటున్న రోట్టెలలో ఒక రొట్టెను పెట్టడమే.*

No comments:

Post a Comment