Thursday, May 16, 2024

బ్రహ్మానంద స్వరూపుడు, జ్ఞాన స్వరూపుఁడు, శాశ్వతుడు, త్రిగుణాతీతుడైన సద్గురువు అవసరంలేని మానవుడు ఈ భూమిపై లేడు

 *బ్రహ్మానంద స్వరూపుడు, జ్ఞాన స్వరూపుఁడు, శాశ్వతుడు, త్రిగుణాతీతుడైన సద్గురువు అవసరంలేని మానవుడు ఈ భూమిపై లేడు.*


*గురుతత్వ సారమంతా స్కాంద పురాణంలో పార్వతీ పరమేశ్వరుల సంవాద రూపంలో 351 శ్లోకాలలో నిక్షిప్తమై ఉంది.*


*' గు ' కార ' రు 'కారాల కు బుధులు పలు అర్ధాలు చెబుతున్నారు .*


*'గు 'కారం గుణాతీతం, 'రు కారం రూపాతీతం అంటే గురువు నిర్గుణ పరబ్రహ్మ్మతో సమానుఁడు.*


*'త్రిమూర్తులకన్నా అతీతుడు గురువు అని ఉపనిషద్ కథనం.*


*శివుడు కోపిస్తే గురువు మనలను రక్షిస్తాడు. గురువు కోపిస్తే లొకంలో కాపాడేవారే లేడు.*


*గురుపాదం పూజకు కారణం,గురు వాక్యం మంత్రానికి ఆద్యం.*

*గురుకృపే మోక్షము.*


*గురుశిష్యుల లక్షణాల గురించి సంత్ కబీరుదాస్ ఇలా చెప్పాడు " గురువు అడగకపోయినా శిష్యుడు తన సర్వస్వాన్ని గురు చరణాల వద్ద అర్పించటానికి సిద్దమవ్వాలి.*


*'పవిత్రాత్మ ' గల గురుదేవుడు ఉన్నచోట సర్వదేవతలు సంచరిస్తారట.*

*గురుకృపవల్ల శిష్యుడికి అష్టసిద్ధులు, నవనిధులు సంప్రాపిస్తాయి మనిషిని మనిషిగా తీర్చిదిద్దేది గురువే.*

*జ్ఞానములలో కెల్లా ఉత్తమ జ్ఞానం అత్మ జ్ఞానం.*

*దానిని ప్రసాదించెడి గురువే సద్గురువు.*


*సాయిసచ్చరిత్రలొ షిర్డి సాయిబాబా గురువు అనుగ్రహము ఎటుల పొందవలెనో విశదీకరించి ఎందరో భక్తులకు అత్మజ్ఞానం ప్రసాదించి ముక్తి ప్రసాదించారు.*

No comments:

Post a Comment