Thursday, May 16, 2024

సాయిబాబా షిరిడీలో ఉన్న కాలంలో, షిరిడీకి వచ్చిన భక్తులు స్వచ్ఛంధంగా అనేక రకాల సేవలు చేస్తుండేవారు

 *సాయిబాబా షిరిడీలో ఉన్న కాలంలో, షిరిడీకి వచ్చిన భక్తులు స్వచ్ఛంధంగా అనేక రకాల సేవలు చేస్తుండేవారు.*

*బాబా భక్తుడైన జ్యోతిన్డర్ తర్ఖడ్ షిరిడీలో, ద్వారకామాయిలో పెట్రొమాక్స్ లైట్లు శుభ్రం చేయడం, సాయంకాలము వాటిని వెలిగించి ద్వారకామాయి అంతటా వాటి స్థానాలలో వేలాడదీయడం, వంటి పనులు చేసేవాడు.*


*ఒకసారి బాబాతో తాను ద్వారకామాయిలో దీపాలు వెలిగించనని, ఎందుకనగా లాంతరు వెలిగించగానే ఎన్నో పురుగులు దీపాలు చుట్టూ చేరి, కొంతసేపు తిరిగి క్రిందపడి చనిపోతున్నాయని చెప్పి, దీపాలు వెలిగించకపోతే పురుగులు చనిపోవని బాబాకు వివరించాడు.*


*అది విన్న బాబా " హే ! భావు ! నీవు లాంతరులు వెలిగించకపోవడం మాత్రాన, ఆ పురుగులన్నీ చనిపోవా ?*

*ఇక్కడ కాకపొతే అవి ఎక్కడ దీపాలు వెలుగుతున్నాయో అక్కడకి పోయి చస్తాయి.*

*ఇది అంతా భగవంతుని సృష్టి.*

*జీవి పుట్టే సమయములోనే చావును కూడా నిర్ణయిస్తాడు.*

*ఒకవేళ లాంతర్, దీపం లేకపొతే మరొక ప్రాణి వాటిని అంతం చేస్తుంది.*


*ఈ విధమైన పనుల వలన మానవులకు పాపాలు జమకావు.*

 *నీ ముఖ్య ఉద్దేశం ద్వారకామాయిలో దీపాలు వెలిగించి, చీకటిని తొలగించి భక్తులు సేవలు చేసికొనుటకు.*

 *నీవు ఎటువంటి పాపము చేయడం లేదు " అని బాబా చెప్పారు.*

*మనం భగవంతుని పనులలో కల్పించుకోరాదు. ఆయన ప్రాణం పొసినప్పుడే, దాని పక్కనే మరణము కూడా నిర్ణయిస్తాడు. అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా, నీవు భగవంతుని సేవ చేస్తూ ఉండు. దేవుడు నీ యడల దయగా ఉంటాడు.*

*( అల్లహ్ అచ్ఛా కరేగా ).*

No comments:

Post a Comment