Thursday, May 16, 2024

సాయిబాబా సాహిత్యములో నవవిధ భక్తిమార్గాలు అశ్రయించి కృతకృత్యులైన వారెందరో ...అందులో ఒక సంఘటన

 *నామ స్మరణ.*


*" మహాదేవుడైన శంకరుడు హాలాహలము తాగి వ్యాకులైనప్పుడు రామ నామమును స్మరించుటచేతనే ఆ కష్టము తొలగెను " అని ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు తన " దాస బోధ " గ్రంథంలో వివరించారు.*

*ఇంకా " పరమాత్ముడగు హరి నామము జపించి ప్రహ్లాదుడు తండ్రి బెట్టు పలు కడగండ్లనుండి బ్రతికెను " అని నామ ప్రాశస్త్యాన్ని అనేక ఉదారణలతో తెలిపారు.*


*ఇక సాయిబాబా సాహిత్యములో నవవిధ భక్తిమార్గాలు అశ్రయించి కృతకృత్యులైన వారెందరో ...అందులో ఒక సంఘటన.*


*అది మార్చి నెల 31 వ తేదీ 1915 సం.*

*ఆనాడు సాయిభక్తుడైన బల్వంత్ నాచ్నే , అతని మిత్రుడైన మోరేశ్వర ఫన్శే ఇంకా మరికొందరితో దట్టమైన అడవిగుండా ఎడ్లబళ్లపై ప్రయాణం చేస్తున్నారు.*

*రహదారి ఎత్తుపల్లాలతో ఉండి, వారు పాంషెట్ కనుమ వద్దకు వచ్చారు.*


*ఆ ప్రదేశం పెద్దపులులు తిరిగే ప్రదేశం.*

 

*ఎద్దుల బండి ఒక చోట చేరగానే అకస్మాత్తుగా బండి ఎద్దులు వెనకకు నడవసాగాయి.*


*ఆ ప్రదేశం ఇరుకు దారి.*


*బండి ఏమాత్రం ప్రక్కకు కాస్త వొరిగినా బండిలో ఉన్నవారందరూ సమీపానగల లోయలో పడతారు.*


*ఎద్దులు ఎందుకు వెనుకకి పోతున్నాయో శాంతారాం చూశాడు.*


*ఎదురుగా దారిలో భయంకరముగా ఒక పెద్దపులి పడుకొని బండి వైపు చూస్తుంది.* 

*పైగా దాని కనులు చీకటిలో మెరగసాగాయి.*


*ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుంది వారి పరిస్థితి.*


*బండి వెనుకకు పోకుండా పెద్ద రాయిని పెట్టేందుకు దిగుదామని శాంతారాం అనుకున్నాడు.*


*వెంటనే సాయిభక్తుడైన నాచ్నే "జై సాయిబాబా ! పరుగున వచ్చి ఈ ఆపదనుండి కాపాడు !"అని పెద్దగా అరిచాడు.*


*ఎక్కడో షిరిడీలో నున్న సాయిబాబాకు సాయి నామం వినబడింది.*


*ఇంతలో హట్టాతుగా ఆ పులి కి భయం వేసి బండి పక్కనుండే పరుగున పారిపోయింది.*


*వారు సాయినామ స్మరణ చేసి ఆ గండం నుండి బయటపడ్డారు.*


*నాచ్నే మరియు మిగతావారికి అడవిలో అర్ధరాత్రి పులివలన ప్రాణహాని కలుగలేదు.* 


*అదే సాయినామ మహిమ.*


*ఏ కాలమందైనా, ఎక్కడైనా నిరంతరం సాయిని స్మరించెదము గాక !*

No comments:

Post a Comment