Wednesday, May 15, 2024

కర్మ సిద్దాంతం ఎంతో బలీయమైనది.* *అన్ని జీవులు దానికి లొబడే జీవించాలని ఒక సంఘటనలో శ్రీ సాయిబాబా అద్భుతంగా బోధించారు.*

 *కర్మ సిద్దాంతం ఎంతో బలీయమైనది.*


*అన్ని జీవులు దానికి లొబడే జీవించాలని ఒక సంఘటనలో శ్రీ సాయిబాబా అద్భుతంగా బోధించారు.*


*ఒకసారి బొంబాయి భక్తుడు, షిర్డికి వచ్చి బాబా దర్శనం చెసుకోలేని కారణంగా, రెండు రూపాయలు మనియార్డర్ ద్వారా శ్యామా పేరున పంపాడు.*


*పోస్టుమాన్ ఆ మనియార్డర్ తీసుకొచ్చిన సమయానికి ద్వారకామాయిలో బాబా భక్తుడైన శ్యామా తప్ప ఎవరూలేరు. కనుక బాబాకు ఈ విషయము తెలిసే అవకాశం లేదు.*


*తాను రేయింబవళ్లు సహచర్యం చేస్తున్న సాయిబాబా సర్వఙ్ఞత ఏంటిదో పరీక్షించుదామని అనుకున్న శ్యామా ఆ రెండు రూపాయల నాణేలను ద్వారకామాయిలో ఒకచోట పాతిపెట్టాడు.*

*ఈ సంగతి మరెవ్వరికీ చెప్పలేదు.*


*కొద్దిరోజుల తరువాత సాయిబాబా వద్దకు ఒక భక్తుడు వచ్చి తనకు రైలు చార్జీల నిమిత్తమై రెండు రూపాయలు సహాయము చేయమని కోరాడు.*

*అప్పుడు బాబా ద్వారకామాయిలో ఒక ప్రదేశం చూపించి అక్కడ తవ్వమన్నారు.*

*మొదట తవ్వగా రెండు రూపాయల నాణేలు దొరికాయి.*


*అతడు మరొకసారి తవ్వడానికి ప్రయ్నతించగా బాబా అతనితో " నువ్వు అక్కడ కందకం తవ్వినా, ఒక పైసా కూడా అధికంగా దొరకదు " అని చెప్పగా, అతడు సిగ్గుపడి వెళ్లిపోయాడు.*

*అరు నెలల తరువాత శ్యామా ఇంట్లొ దొంగలు పడి సర్వము దోచుకొనిపోయారు.*


*శ్యామా ఏడుస్తూ బాబా కాళ్లమీద పడి, పోయిన తన సంపదలు తిరిగి ఇప్పించమని ప్రార్దించాడు.*


*అప్పుడు బాబా చిరునవ్వుతో " ఓయీ శ్యామా ! నీఇంట్లో దొంగలు పడితే చెప్పుకోవడానికైనా నేనున్నాను.*


*నావి రెండు రూపాయలు అరునెలల క్రితం పోయినవి, మరి నేనెవ్వరితో చెప్పుకోను ? " అని అన్నారు.*

*అందుకు శ్యామాకు ఉక్రోషం పెరిగింది.*

*బాబాయే ఏదో కావాలనీ చేశారన్న భావనతో " బాబా ! నీవి కేవలం రెండు రూపాయలు మాత్రమే పోయాయి.*

*నావైతే ఇరవైవేలదాకా పొయాయి " అని అనగా బాబా శ్యామాతో ప్రసన్నంగా* 

*" నీలాంటి గవర్నమెంటు ఉద్యోగికి ఇరవై వేలు రూపాయలు ఎంతో, నాలాంటి పేద ఫకీరుకు రెండు రూపాయలు కూడా అంతే.*

*చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా అని అంటారు.*


*మన స్థాయికి తగ్గట్టే కర్మ సూత్రము అనుభవం అవుతుంది మందుగా కర్మ సూత్రము అర్థం చేసుకో ! శ్యామా !" అని అన్నారు.*


*ఆ మాటలు విన్న శ్యామాకు తన తప్పు తెలిసి, జ్ఞానోదయం కలిగింది.*

No comments:

Post a Comment