*శ్రీ సాయిబాబా చరణాలలో మనసు లయమైపోయి, ఎటువంటి భీతి లేకుండా మరణాన్ని ప్రాప్తిచేసుకొన్న వారు ఎంతో అదృష్టవంతులు.*
*అది వారి పూర్వ జన్మకి సంబంధించిన సంస్కారం.* *వారి జీవితాలు ధన్యం*
*సాయిభక్తుడైన తాత్యాసాబ్ నూల్కరు 1909 సం. లో బాబా వద్దకు మొదటిసారిగా వచ్చాడు.*
*వచ్చిన మొదటి రోజులలోనే అతనికి కలిగిన అనుభవాలతో బాబా యందు అపరిమిత విశ్వాసం కలిగి షిర్డీలోనే ఉండిపోయాడు. అతను షిరిడీలో ఉన్నప్పుడు, కళ్లకు వ్యాధి కలిగి ఎంతో బాధతో కుమిలిపోయేవాడు.* *అతను బాబాను అదేపనిగా ప్రార్ధించగా, బాబా ఆ జబ్బును తన కళ్ళమీద తీసుకుని అతని వ్యాధిని నయం చేసారు.*
*1911 సం.లో నూల్కరు శిర్డీలోనే ప్రాణం వదలి సాయిబాబాలో ఐక్యమైనారు. అతని చివరి కోరిక మేరకు బాబా చరణ తీర్ధాన్నీ అందించారు. బాబా నామ స్మరణతో, సాయిని మనసునిండా నింపుకొని ప్రాణాలు వదిలాడు.*
*అతను మరణించిన తరువాత బాబా దగ్గర వున్న భక్తులతో " తాత్యా ( నూల్కరు )మన అందరికంటే ముందే వెళ్లిపోయాడు.*
*నా ఆజ్ఞ అనుసరించి ఇక్కడే ఉండి తన జీవితాన్ని సఫలం చేసుకున్నాడు. అతనికి పునర్జన్మ లేదు " అని పలికారు.*
*అలాగే మరొక భక్త శ్రేష్ఠుడైన మేఘా శ్యాముడు ధన్యుడు. చివరి ఘడియలలో భగవన్నామం చేస్తూ తన ఇష్ట దైవంలో ఐక్యమయినాడు.*
*మేఘా పార్థివ శరీరానికి బాబా స్వయంగా ఉత్తరక్రియలు జరిపి అతనియందు తనకు గల ప్రేమను చూపించారు.*
No comments:
Post a Comment