*మానవజన్మను ఎత్తిన తర్వాత పిచ్చి పిచ్చి కోరికలు పుట్టడం సహజం. కోట్లు సంపాదిద్దాం అని ఆలోచించే రోజులు ఇవి.*
*కానీ ఈ జన్మ ఒక మహానుబావుడి సేవకు అంకితం చేద్దాం అని ఆలోచిస్తే, ఇంక జీవితమే ధన్యం అయినట్లే.*
*ఒక సద్గురువుకి చేసే సేవ ముందు మిగిలిన కోరికలు ఎందుకు పనికిరావు.*
*అందుకే బాబా జీవిత చరిత్రను పరిశీలిస్తే, ఒక భక్తుడు బాబా దగ్గరికి కోరికలతో రాకండి అని చెప్పుతున్నపుడు అందుకు బాబా తిరిగి ఇలా అన్నారు*
*అలా చెప్పవద్దు ముందు నా దగ్గరికి అందరు కోరికలతోనే వస్తారు. ఒకసారి వారి కోరికలు తీరాక నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు అని సమాధానం చెప్పారు.*
*ఇంకొకసారి ధనికులు ద్వారకామాయిలోకి వచ్చి బాబాతో మాకు డబ్బుకావాలి అని విసిగిస్తున్నారు. బాబా మౌనంగా కూర్చున్నారు.*
*ఇంక బాబా ఇవ్వరు అని వాళ్ళు షిర్డీ నుండి వెళ్ళిపోయాక మిగిలిన భక్తులతో బాబా నా దగ్గర భగవంతుడి గురించి విషయాలు చాలా వున్నాయి. నన్ను అడగనక్కరలేదు తీసుకొని పొవ్వచు. పొంగి పోరలుతున్నది. కాని అది ఎవరు అడగరు. ఎవరు వచ్చినా కోరికలు, డబ్బు కావాలి అని వస్తున్నారు. ఎంత డబ్బు ఇస్తే మీ దేహాలు తృప్తి పొందుతాయి. డబ్బు అవసరమే ఎంతవరకు ? ఉండడానికి, తినడానికి, కట్టుకోవడానికి మాత్రమె. మనిషి కోరికలకు అంతు ఎక్కడుంది*. అని అడిగారు.
*భగవంతుడు కంటి ముందు ఇన్ని లీలలు చూపిస్తున్న ఒక్కసారి కూడా మనం మనకు జరిగిన మంచి పని వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారు అని కూడా ఆలోచించలేని పరిస్థితి ఈ కలియుగం.*
*మనకు జరిగిన మంచి పనికి భగవంతుడు వచ్చి నేనే నీకు మంచి చేసింది అని చెప్పారు. మనం గుర్తించ గలిగితే ఆయన పాదాల మీద పడిపోతాం.*
*షిర్డీ అంతటి పవిత్రమైన స్థలానికి వెళ్లి జీవితాలను మార్చుకున్న భక్తులు కొన్ని కొట్లలో వున్నారు.*
*అందుకే బాబా ఒక మాట అన్నారు.*
*ఎవరైతే షిర్డీలో అడుగుపెడుతారో వాళ్ళ కష్టాలను తొలగిస్తాను అది సత్యం అని బాబా నిరూపించారు.*
*పిలిచిన వెంటనే పలికే దైవం శ్రీ షిర్డీ సాయిబాబా.*
*మనం సాయి భక్తులం అవడం ఎంతటి పుణ్యమో మాటల్లో చెప్పలేనిది.*
*బాబాకు భక్తుడై కూడా ఆయన సేవను చేయకపోవడం చాల పొరపాటు.*
*మళ్ళీ ఇలాంటి మహానుభావుడు మనకు దొరకడు.*
*" సాయిని సేవించి నీ జీవితం ధన్యం చేసుకో "*
*ఓం శ్రీ సాయిరాం*
No comments:
Post a Comment