Thursday, May 16, 2024

ఈ హారతి పాట షిర్డీసాయి బాబా వారికిచ్చే "ధూప్ హారతి " లోనిది.* *దీనిని రచించిన వారు సాయి అంకిత భక్తుడైన " శ్రీ బాలకృష్ణ విశ్వనాథ దేవ్ ".*

 *'రుసో విమల కిన్నెరా, అమల యక్షిణి హీ రుసో* 

*రుసో శశి ఖగాదీహి, గగన తారకా హీ రుసో* 

*రుసో అమరరాజా హీ, ఆదయ ధర్మరాజా హీ రుసో* 

*న దత్తగురు సాయిమా మాజవారి కధీ హీ రుసో .."*


*ఈ హారతి పాట షిర్డీసాయి బాబా వారికిచ్చే "ధూప్ హారతి " లోనిది.*


 *దీనిని రచించిన వారు సాయి అంకిత భక్తుడైన " శ్రీ బాలకృష్ణ విశ్వనాథ దేవ్ ".*


*ఇందులో బాబా ఎడల సంపూర్ణ శరణాగతి తత్వం కనిపిస్తుంది. శుద్ధులైన యక్షులు, కిన్నెరులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు, ఆకాశమున కనిపించు నక్షత్రాలు, దేవేంద్రుడు, మృత్యుదేవత అయిన యమధర్మరాజు వీరందరూ నాయందు కనికరము చూపకపోయినా, సాయిబాబా ! నీవు మాత్రము నా యందు అలగకుము.* *( కోపించకుము ).*


         *తల్లితండ్రులు తోబుట్టువులు బంధువులు సృష్టిలో గల సర్వభూతములు మున్నగువారు అలిగినను తనను విడవ వద్దని తనపై ఆలుగవల్లదని అతివినయంగా శరణాగతితో బాబాను వేడుకున్నారు, మరొక యాచనా దశకంలో.*


 *ఇందులో భావార్ధం, మన జీవితం విశ్వప్రభువైన సాయినాధునికి సంపూర్ణ సమర్పణ గావించినచో, జాతకరీత్యా సంభవించు గ్రహదోషాలు, కష్టనష్టాలు, ఆపదలు, అకాల మరణాలు గూర్చి భయపడనవసరం లేదు. సాయి పరిపూర్ణ అనుగ్రహం, ఆశ్శీస్సులు ఉన్నవారికి* 

*" గ్రహబలమేమి చేతురా ?*

*అని సాయిని ధృడంగా నమ్ముతున్నారు ( పట్టుకున్నారు ) దేవు గారు.*


      *ఇది అతనికి సాయిపై ఉన్న అనన్యభక్తికి పరాకాష్ట, పరిపూర్ణ శరణాగతితో ఆశ్రయించటమే.*


*"ప్రసాద యాచనా దశకం" సాయి భక్తుల శరణాగతికి మకుటము.*

 

*జ్జానేశ్వరీ గ్రంధంను పారాయణ చేయలేక పోవడం అనే తన బలహీనతను సాయికి వ్యక్తీకరించారు.* 


 *సాయంసంధ్య హరతిలో, భక్తులు భక్తిపూర్వకంగా పాడుకొనే గీతం, "ప్రసాద‌ యాచనా దశకం" ను రచించినవారు బాబా భక్తుడైన శ్రీ బాలకృష్ణ విశ్వనాధ్ దేవ్ ప్రస్తావన సాయిసచ్చరిత్ర 5, 41 వ అధ్యాయములో కనిపిస్తుంది.* 


*శ్రీ బి వి.దేవ్ రచించిన ఈ హారతి గీతం బాబా మహాసమాధి చెందిన 22 సంవత్సారలకు అనగా 1940 సం. లో సాయి హరతులలో చేర్చబడినది.*


*దీనిని శ్రీ బి.వి.దేవ్* 

*7 -3 -1940 గురువారము ( మహాశివరాత్రి రోజున )  సంకలనం చేసారు.*

*నేటికి 84 సంవత్సరాలు ముగిసింది.*


        *సాయి హారతులు రచించిన వారంతా ఎంతో ఆర్తి, ఆర్ధ్రత నింపుకొని, నవవిధభక్తి అంశాలను మేళవించి రచించారు.*


      *హారతులను పాడేవారు భావర్ధాన్ని స్మరించుకుంటూ పాడే ఆవశ్యకత ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది* *మనము సాయి ముందు ప్రత్యక్షంగా ఉన్నాము మనము పాడేది బాబా కోసం, వినేది సాయియే అన్న ఎరుకలో ఉంటే మన హృదయాంతరాల నుండి భావోద్వేగంతో కూడిన కంఠంతో మనము పాడగలుగుతాము.*


       *హారతులను అనురక్తితో ఆలపించినప్పుడు మన మనసు మెత్తబడటమే కాకుండా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.*

No comments:

Post a Comment