*శ్రీ సాయి సచ్చరిత్ర ఎలా చదవాలి ?*
*ఒక సాయి భక్తుడు సాయి సచ్చరిత్ర పారాయణ పది, పన్నెండు సార్లు పారాయణ చేసినా అతని కోరుకొన్న కోరిక నెరవేరలేదు.*
*ఆ విషయాన్నీ M.B నింబాల్కర్ అనే సాయి అంకిత భక్తునకు తెలిపాడు. అతను సాయి సచ్చరిత్ర రైలు బండి వేగంలో గడగడా చదవటం మొదలెట్టాడు. అలా సాయిసచ్చరిత్ర హడావిడిగా అర్థం పట్టించుకొకుండా, చదవడం సరైన పధ్ధతి కాదు.*
*మనం తీసుకొన్న ఆహారము, ఏ పాళ్ళలో రక్తంగా మారుతుందో అది మాత్రమే జీర్ణమైనట్లు.*
*ఒక్క ఓవి లేదా ఒక పేజీ అయినా అర్థం తెలుసుకుని దాన్ని ఆచరిస్తే జీవనం, పునీతముతుంది.*
*శ్రీ సాయిసచ్చరిత్ర హడావిడి పడకుండా మెల్ల మెల్లగా దానిలోని అర్థం, తెలుసుకుంటూ ఎలా చదవాలో దాని గురుంచి బాబా బోధ శ్రీ సాయిసచ్చరిత్రలొ మూడు చోట్ల లభిస్తుంది.*
*ప్రేమలేకుండా చేసే భజన వల్ల ప్రయోజనమేమిటి, అర్థం తెలుసుకోకుండా గ్రంథాన్ని పఠించటమేమిటి.*
*(అ .14 .ఓ 204 ) కేవలం చదవటంతో అయిపోదు, ఆచరణలోకి తెచ్చుకోవాలి. లేకపొతే బోర్లించిన కుండమీద నీళ్లు పోసినట్లవుతుంది.*
*(అ .21 .ఓ 72 .) మొదట 18 వ అధ్యాయములో సాఠే చేసిన గురుచరిత్ర సప్తాహం పూర్తైనాటి రాత్రి సాయిబాబా అతనికి స్వప్నానుభవం ఇచ్చి, అతనికి పారాయణ చెయవలిసిన విధానాన్ని నేర్పించారు.*
*సప్తాహం పూర్తైన నాటి రాత్రి కలలో గ్రంథాన్ని పట్టుకొని బాబా స్వయంగా దాని ఆర్ధాన్ని బోధించారు.*
*(ఓ 44 )41 వ అధ్యాయములో బి.వి. దేవ్ కు జ్ఞానేశ్వరి ఎలా చదవాలో నేర్పించారు.*
*అలాగే గ్రంథ పారాయణ చేసి దాన్ని ఆచరణలో పెట్టాలి. దీని గురుంచి 21 అధ్యాయములో వినాయక్ ఠాకూర్ కథలో చెప్పబడింది.*
*పారాయణ అర్ధాన్ని తెలుసుకుంటూ చదవాలంటే ఏకాగ్రత, స్వస్థత అవసరం.*
*వినటానికి చెవి ఆదరంతో సిద్దపడకపోతే వృత్తి ఏకాగ్రము అవదు. అది అసలు పారాయణే కాదు అక్కడ శబ్దార్ధాలు ఎవరు గుర్తుపడతారు.?*
*(అ .50 .ఓ 52 )*
*మనసు అస్వస్థత పోకపోతే గ్రంథపారాయణ చేయటం అనవసరం. శాస్త్రాభ్యాసం వ్యర్థం.*
*పుస్తక జ్ఞానం కూడా వ్యర్ధమే.*
*(అ .21 ఓ 8 )*
*వీటి అన్నిటికంటే ముఖ్యమైనది గ్రంథపారాయణ చేసేటప్పుడు శ్రద్ద - సహనం ఉంటేనే అనుకున్న ఫలప్రాప్తి అవుతుంది.*
*హడావిడి పడకుండా శ్రద్దతో ఈ కథ అనే అమృత రసధారలు అదరపూర్వకంగా సేవిస్తే శ్రోతలకు ప్రేమయుక్త భక్తి లభించి, వారు కృతార్థులవుతారు*
*(అ .15 .ఓ 8 )*
*సరే చివరికి సంతశ్రేష్టులు జ్ఞానేశ్వరి ఒక అత్యంత అందమైన ఉపమానము ఇచ్చి పారాయణ ఎలా చేయాలో చెప్పారు. దాని భక్తులు మనసులో దృఢంగా ముద్రించుకోవాలి.*
*శరత్ ఋతువులో చంద్రకిరణాల్లోని కోమలమైన అమృతకణాలను చకోర పక్షి పిల్లలు ప్రశాంత చిత్తంతో సేవించినట్లే శ్రోతలు మనసుని మార్దవంగా చేసుకుని ఈ కధానుభూతిని పొందాలి.*
*(జ్ఞానేశ్వరి అ 1 ఓ 56 ,57 )*
No comments:
Post a Comment