Wednesday, May 15, 2024

అది 1914 సం. ఏప్రియల్ నెల. శిరిడీ గ్రామమంతా శ్రీరామ నవమి ఉత్సవాల సంబరాలతో భక్తులతో కిటకిటలాడుతోంది.* *ద్వారకామాయిలో సాయినాథుని చుట్టును వందలాది భక్తులు మూఁగి ఉన్నారు.*

 *అది 1914 సం. ఏప్రియల్ నెల. శిరిడీ గ్రామమంతా శ్రీరామ నవమి ఉత్సవాల సంబరాలతో భక్తులతో కిటకిటలాడుతోంది.*

*ద్వారకామాయిలో సాయినాథుని చుట్టును వందలాది భక్తులు మూఁగి ఉన్నారు.*


*ఎక్కడ నుంచో ఒక వృద్ద మహిళ సాయి దర్శనానికి షిరిడీ ద్వారకామాయికి వచ్చింది.*

*ఆ వృద్ద మహిళ జనమును త్రోసుకు పోలేక ద్వారకామాయి బయట బిగ్గరగా అరుస్తుంది.*


*ఆ ఆక్రందనలు బాబా చెవికి సోకకుండా ఎలాగుంటుంది ?సాయిబాబా సమకాలికుడు నాగపూరు నందు ఉండే తాజుద్దిన్ బాబా.*


*ఆయన అక్కడ రాజసౌధంలో ఉండగా తార అనే భక్తురాలు తాజుద్దిన్ బాబాకు భోజనం సమర్పించాలని భోజనం సిద్ధం చేసింది.*

*ఇక ఆయన గూర్చి విచారిస్తే బాబా రాజసౌధంలో ఉన్నాడని అక్కడవారు చెప్పారు.*

*ఆ పేదరాలు రాజసౌధంలో ప్రవేశించటం ఎలా సాధ్యం ?అని సందేహించింది. కానీ లోపల పోవటానికి ప్రయత్నం చేయలేదు.*


*ఆ రాజసౌధం ముఖ ద్వారం దగ్గర ఉన్న నేరేడు చెట్టుకు తాను తయారుచేసిన ఆహారాన్ని తుండుగుడ్డలో కట్టి వ్రేలాడదీసింది.*


*ఇక తాజుద్దీన్ బాబాకు మనసులోనే నమస్కరించి ఇంటి ముఖం పట్టింది* 

*అక్కడ రాజసౌధంలో తాజుద్దిన్ బాబాకు షడ్రసోపితమైన భోజనం సిధ్ధంగా ఉంది.*

*కానీ ఆయన రాజసౌథం నుండి బయటకి వచ్చి, నెరేడు కొమ్మకు కట్టిఉన్న ఆహారాన్ని తీసుకుని తృప్తిగా భుజించారు.*


*ఆవిధంగా ఆ పేదరాలు సమర్పించిన నివేదన,  బాబా స్వీకరించి ఆమెను అనుగ్రహించారు.*


*ఇక శిరిడీలో బాబా భక్తుడైన శ్యామాను పిలచి, ద్వారకామాయి బయట తన దర్శనం కొరకు విలపిస్తున్న ఆ వృద్ధురాలిని తన దగ్గరకి పిలిపించుకున్నారు.*


 *ఆమె సంతోషానికి అవధులు లేవు.*


*తన రెండు చేతులతో సాయిబాబా నడుమును చుట్టివేసింది* 

*బాబా ఆమె ప్రేమకు ముగ్దుడై ఆమెతో " అమ్మా !నీ కొరకు ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్నాను.* 


*నాకొరకు తినడానికి ఏమి తెచ్చావు ?" అని అడిగారు.*


*వెంటనే ఆ ముదుసలి బాబాతో  " ఇదిగో బాబా ! నీ కొరకు చల్ది రొట్టె ముక్క.*

*దానితోపాటు ఈ ఉల్లిగడ్డ. నేనొక రొట్టె, రెండు ఉల్లిగడ్డలు తీసుకుని నీ దర్శనము కొరకు బయలుదేరాను. దారిలో ఆకలివేసి సగము రొట్టెను, ఉల్లిపాయను తిన్నాను. మిగిలినవి ఇవిగో " అని సాయిబాబాకు ఇచ్చింది.*


*బాబా తృప్తిగా వాటిని తిని " అమ్మా ! నీవు తెచ్చిన రొట్టె ఎంత మధురముగా వుందో తెలుసా ? " అని బాబా చెప్పగా ఆ తల్లి* 

*ఆనందమునకు  హద్డులేదు.*


*ఇక మనము బాబాకు, సమర్పించే మధుర నైవేద్యమునకు సంతసించునుగాక.*

                

      *ఒక సేకరణ*

No comments:

Post a Comment