Thursday, May 16, 2024

సాయిబాబా లీలలు అతి చిత్రముగా ఉండుటచే ఇది సంభవమా ? అని అనిపించడం సహజమే.* *రోజురోజుకి ఈ తండ్రి లీలలు లెక్కకు మించి జరుగుచున్న

 🌾*సాయిబాబా లీలలు అతి చిత్రముగా ఉండుటచే ఇది సంభవమా ? అని అనిపించడం సహజమే.*


*రోజురోజుకి ఈ తండ్రి లీలలు లెక్కకు మించి జరుగుచున్నవి.*


*ఈ లీలలు చూపినంత మాత్రాన శ్రీ సాయిబాబా భగవంతుడని కాదు.*

*లీలలు చూపినను, చూపుకున్నను శ్రీ సాయి అంతర్యామి అగు పరమాత్మ స్వరూపమే " అని తెలిపారు పూర్వ సాయి అంకిత భక్తుడైన వేమూరి వెంకటేశ్వరరావు గారు.*


*సాయిబాబా శ్రీకృష్ణునివలె లీలలు చూపాడు.*


*సాయిబాబా తమలపాకులు అమ్మే మొహద్దీన్ తో కుస్తీ పట్టాడు. మొహద్దీన్ కండబలమున్న సామాన్య మానవుడు.*

*బాబా సామాన్యుని వేషములో ఉన్న సౌర్య బల పరాక్రముడు.*

*బాబా తనకున్న అలౌకిక శక్తి చూపి కుస్తీ పోటీలో గెలవలేదు. సామాన్యునిగా కుస్తీపట్టి ఓడిపోయాడు.*


*ధనబలంతో గానీ, అధికార బలంతో గానీ, దుష్టబుద్దితో గానీ, అనైతిక చర్యలద్వారా గానీ విజయాన్ని సాధించకూడదని, ఓటమి అయినా సరే అంగీకరించాలని తెలిపిన మానవ రూపములోనున్న భగవంతుడు సాయిబాబా.*


*ఎవరైనా తాము చేసే పని సులువుగా ఉండాలని, తెలిసో, తెలియకో ఇతరులకు కష్టమును కలిగిస్తుంటారు.*


*వామన్ తాత్యా అను కుమ్మరివానికి బాబా డబ్బులిచ్చి కాల్చని పచ్చి కుండలను కొనేవాడు.*

*ఎందుకంటే కుండలను కాల్చటం శ్రమతో కూడిన పని. బాబా ఆ కాల్చని కుండలను కొని వామన్ తాత్యాకు శ్రమ తగ్గించారు.*


*సాయిబాబా వద్ధకు డబ్బు ప్రవాహ రూపంలో వచ్చేది.*

*ఆ డబ్బు ఆ రోజులలో బ్రిటీషు వారి రాష్ట్ర గవర్నరు అదాయముతో సమానముగా ఉండేది.*

 **బాబా ఆ డబ్బుతో ఎన్నొ ఘన కార్యాలు చేయవచ్చు. కానీ ఆ రొజు సాయంకాలాని కల్లా ఖర్చు చేసేసేవాడు.*


*బాబా వ్యాపారస్తుడు కాదు, పారిశ్రామికవేత్త కూడా కాదు ఆయన భూమి మీద అవతరించింది, తన నడవడిక ద్వారా మనుషుల అంతకరణాన్ని శుద్ది చెయ్యడానికి.*

*తాను నివశించే పాడుబడిన మసీదుకు కనీసము ద్వారాలు కానీ, కిటీకీలుగానీ పెట్టించుకొలేదు.* 


*చినిగిన కఫనీయే చీనాంబరం.*

*తాను ధరించిన కఫనీ చిరిగిపోతే, తిరిగి ఆ చిరుగులు కుట్టుకోవడానికి కనీసము ఒక సూది కూడా ఆయన వద్ద ఉండేదికాదు. ఒక చెట్టు ముల్లుతో చిరుగులు కుట్టుకొనేవాడు.*


*మనిషికి ధనబలం ఉన్నా ఒక సామాన్యునిలాగా ఎలా బ్రతకాలో ,బ్రతికి చూపించాడు షిర్డి సాయినాధుడు.*


*సాయిబాబా జీవితమే ఒక ధర్మం.*


*ఆయన నడిచిన, బోధించిన మార్గమే నేటి మానవాళికి ఆదర్శం.*

No comments:

Post a Comment