Thursday, May 16, 2024

సాయిబాబాకు అనన్యభక్తుడు మేఘా శ్యాముడు అను భక్తునిగూర్చి సాయిసచ్చరిత్ర 28 వ అధ్యాయములో పరిపూర్ణ వివరణ కనిపిస్తుంది.

 *సాయిబాబాకు అనన్యభక్తుడు మేఘా శ్యాముడు అను భక్తునిగూర్చి సాయిసచ్చరిత్ర 28 వ అధ్యాయములో పరిపూర్ణ వివరణ కనిపిస్తుంది.*


*సాయిభక్త దాసగణు మహరాజ్ తన భక్తసారామృతం అనే గ్రంథంలో మేఘుడి గుర్చి ఎంతగానో, జరిగింది జరిగినట్లుగా అందముగా వర్ణించారు. తల అంతా జఠాజూటంతో, దృఢమైన శరీరంతో ఉండే అతని వాక్కులో తనకు ఇష్టమైన " హరహర శివ " అన్న శివ నామమే అహోరాత్రులు నడుస్తుండేది. ఫాలభాగంపై అడ్డుగా విభూతి రేఖలు దిద్దుకొని, తెల్లని చందనం పెట్టుకొనేవాడు.*


*అతడు బాబా హరతి కూడా ఒంటికాలిమీదే నిలబడి చేసేవాడని అంటారు.*

*నిజంగానే బాబాకి అతనితో ఏదో ఋణానుబంధం ఉండితీరాలి .*


*అతణ్ణి సాఠే అను భక్తుని ద్వారా ఒకరకంగా షిరిడీకి లాగి, అతనికి ఒకే ఒక్క దైవమైన శంకరుడు సాక్షాత్తూ తానే అన్నట్లు అనిపింపచేసి అతని భక్తి పట్లా, తపస్సు పట్ల ప్రసన్నులై సాయిబాబా క్రీ. శ. 1912 వ సంవత్సరంలో షిరిడీలో తన సన్నిధిలోనే మేఘశ్యాముడు మరణించి నపుడు స్వయంగా అతని స్మశాన యాత్రలో తామూ ఉండి, అతని దేహంపై పువ్వులు జల్లి, బాబా అతనికి సద్గతి ప్రసాదించారు.*


*మేఘుడు ఎంతో అదృష్టవంతుడు. అతని యజమాని అంటే రావుబహద్దూర్ సాఠే కి లభించ లేనిదీ, అతనిచే సాధింపబడ లేనిదీ మేఘశ్యామునికి లభించింది.*


*సాఠేకి బాబా ఆశీర్వాదంతో వృధాప్యంలో ఒక కొడుకు పుట్టాడు. ఆదాయము కూడా పెరిగింది.*

*కానీ పరమార్థంలో అతని ప్రగతి అలాగే ఉండిపొయింది.*

*సాఠే మనసులో తన గొప్పతనాన్ని గురించి కొంచెం అహంకారం కూడా ఉండేది.*


*అతనికి షిర్డిలోని గ్రామస్తులతో, అలాగే బొంబాయి నుండి వచ్చిన చందోర్కర్, ధీక్షిత్ లాంటి సుశిక్షితులైన గొప్ప భక్తులతో సరిపడేది కాదు* 


*క్రీ .శ .1918 సంవత్సరం ప్రారంభంలోనే బాబా హయాం లొనే అతడు షిర్డి వదలి పుణేలోని తన గ్రామానికి వెళ్ళిపోయి మళ్లీ తిరిగి రానేరాలేదు.*


*మేఘశ్యాముడు మాత్రం తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు .*


*దీనిని బట్టి ఏమి తెలుస్తుందటే గురుకృప ఉన్నప్పటికీ, సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి.*


*గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి సాధనను నడిపిస్తారు.*


*ఈ విషయాన్నీ బాబా స్వయంగా చెప్పి ఉన్నారు.*

No comments:

Post a Comment