*షిరిడీ సాయిబాబా తనను నమ్ముకొన్న భక్తులకు సహాయం చేస్తారని లోక విఖ్యాతమే.*
*అయితే ఆ సహాయం యే రూపంలో అందుతుందో మన ఊహకు అందదు.*
*తన భక్తుడైన నానాసాబ్ చందోర్కర్ కు దప్పికతో ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు భిల్లుని రూపంలో నీరు అందించి ప్రాణం కాపాడాడు.*
*బలరాం మాన్కర్ కు పల్లెటూరి వ్యక్తి రూపంలో రైలు టికెట్ అందించాడు.*
*డేంగ్లే పొలంలో మరచిన బిడ్డను తన రూపంలో వెళ్ళి వర్షంలో తడుస్తున్న బిడ్డను కాపాడాడు.*
*ఇలా ఎన్నో, మరి యెన్నెనో మహాసమాధి అనంతరం కూడా కాపాడుతూనే ఉన్నాడు.*
*అది 1956 సం. హైస్కూల్ లో s .s .c పరీక్షలు చివరి రోజున జరిగిన సంఘటన.*
*ఒక విద్యార్థి s .s .c చివర పరీక్ష వ్రాసాడు.*
*అదే రోజున జ్వరం, జ్వరంతో పాటు వంటిపై గడ్డ లేచింది. అది తగ్గింది కానీ కాళ్ళు చచ్చు బడ్డాయి.*
*భర్త లేని అతని తల్లి వైద్యం చేయించింది. అతను నడవలేక పోతున్నాడు. డబ్బు ఖర్చు అయింది కానీ వ్యాధి తగ్గలేదు.*
*ఈ విపత్కర సమయంలో ఎవరో షిరిడీ బాబా మహాత్యం గురించి తెలిపారు. విన్న తరువాత ఆమెలో ఆశ, ఆశతో పాటు భక్తి కూడా కలిగింది.*
*వెంటనే ఆ తల్లీ కుమారులు ఎంతో ప్రయాసతో షిరిడీ చేరుకున్నారు.*
*ఆమె తన కొడుకును సమాధి మందిరానికి తీసుకెళ్ల ప్రయత్నం చేసింది.*
*కానీ నడవలేని స్థితిలో నున్న తనను ఎవరొ మోసుకెళ్ళాలి కనుక ఆమె కొడుకుకి నచ్చలేక, వెళ్ళడానికి ఇష్టపడలేదు. పైగా అందరూ నవ్వుతారని అతని బాధ.*
*ఆమె ఒంటరిగానే సమాధి మందిరానికి, ద్వారకామాయి కి వెళ్ళి బాబాకు తన గోడు చెప్పుకొంది. బసలో ఉన్న తన కొడుకును మందిరానికి రమ్మని వరుసగా రెండు మూడు రోజులు కోరినా అతను రానని చెప్పాడు.*
*చివరగా ఆమె సమాధి మందిరానికి కాకడ హరతికి వెళ్ళి, ఎంతో ఆర్తితో సాయిని ప్రార్ధించి తన ఉంటున్న బసకు వచ్చింది.*
*ఆ స్థలంలో పిల్లవాడు కనిపించలేదు. మరల సమాధి మందిరానికి వెళ్ళి బాబాను కన్నీటితో ప్రార్ధించింది.*
*అక్కడే వెనుతిరిగి చూడగా, సమాధి మందిరంలో ఒక స్తంభాన్ని పట్టుకొని నిల్చున్న ఆమె కుమారుడు కనిపించాడు.* *అది చూసి ఆమె ఆశ్చర్యపోయింది.*
*తన కుమారుని విషయము అడుగగా బాబా తన ఉన్న బసకు వచ్చి తనముందు నిలబడి " లే ! లేచి నిలబడు" అని అన్నారని, అలా బాబా అనగానే తాను లేచానని ఆయన వెంట సమాధి మందిరానికి వచ్చానని చెప్పాడు.*
*అది తన యందు గల కృపగానే భావన చేసింది. కుమారునితో బాబాకు నమస్కరించి వెళ్ళిపోయింది.*
*మెల్లమెల్లగా ఒక నెల తిరిగే సరికి తన కాళ్ళమీద నిలబడి నడవసాగాడు ఆ కుర్రవాడు.*
*ఇది మన విశ్వాసానికి, భక్తి కి సాయినాధుడు ఇచ్చే ప్రతిఫలం.*
No comments:
Post a Comment