Thursday, May 16, 2024

షిరిడీలో బాబాను దర్శించడానికి వచ్చినవారు ఎంతోమంది ఉన్నారు

 *"భార్యాబిడ్డలతో, ధన సంపాదనతో మునిగిపోయేవారు అజ్ఞానులు.*

*సాధు సత్పురుషులు అటువంటి అజ్ఞానులను కరుణిస్తారు " అని వ్రాశాడు హేమాడ్ పంత్ తన సాయి సచ్చరిత్రలో.*


*అంటే ధన సంపాదనలో పడి వేరేమార్గం అంటూ లేనివారు అజ్ఞానులు, అమాయకులు అనుకొవచ్చు.*


*జ్ఞానం అజ్ఞానం అంటే ఏదో తెలిసి, అధ్యాత్మిక పథంలో వుండేవారు ఆజ్ఞానులు కారు.*


*షిరిడీలో బాబాను దర్శించడానికి వచ్చినవారు ఎంతోమంది ఉన్నారు.*


*వారిలో ఉదాహరణకి మూలేశాస్త్రి, మరొకరు పేరు తెలియని డాక్టరు.*


*మూలేశాస్త్రి ఆరు శాస్త్రాలను అధ్యయనం చేశాడు. డాక్టరు తన వృత్తిలో నిష్ణాతుడు.*


*ముళే శాస్త్రికి తన గురువే ప్రధానం. డాక్టరు రామోపాసకుడు. ఇద్దరు తమ తమ కర్మలలో అరితేరినవారు.*


*ఆ ఇద్దరికి సాయిబాబా " ముస్లిం " అన్న అభిప్రాయం ఒకటి ఉన్నది.* *అయితే వారిద్దరూ షిర్డి సాయిబాబాను దర్శించటానికి, ఆరాధించడానికి రాలేదు.*


*ముళే శాస్త్రికి నాగపూరు కోటీశ్వరుడైన బుట్టి గారితో పనిబడ్డది.*

*ఆ బుట్టి ప్రస్తుతం షిరిడీలో సాయిబాబా వద్ద ఉన్నాడు.*


*అందువలన ముళే శాస్త్రి తన అవసరార్థం షిరిడీకి వచ్చాడు.*

*ఇక డాక్టరు విషయానికి వస్తే, డాక్టరు స్నేహితుడు సాయిబాబా భక్తుడు.*

*డాక్టరు ఆ సాయబాబా భక్తునితో షిరిడీకి వచ్చాడు అంతే.*

*అతడు కావాలని షిరిడీకి రాలేదు.*

*అయినా వారిద్దరూ భక్తి మార్గంలో ఉన్నవారే.*

*అట్టివారికి సరైన అవగాహన లోపించింది.*


*వారిద్దరూ భక్తి మార్గంలో విహరించవలిసిన చేపలు.*

*కేవలం నూతిలోనే కొట్టుమిట్టాడుతున్నారు.*


*సాయిబాబా వారిద్దరినీ కరుణించాడు.*


*ముళే శాస్త్రికి బాబా అతని గురువుగా దర్శనమిచ్చాడు.*

*తన గురువును తన కండ్ల ఎదుట చూశాడు ములేశాస్త్రి.*

*ఎప్పుడో మరణించిన తన గురువు తన కళ్ల ముందు ఎలా ఉన్నాడో చూసి ఆశ్చర్యపోయాడు.*


*ఇక డాక్టరు విషయానికి వస్తే, డాక్టరు రామ భక్తుడు.*

*సాయిబాబా స్థానంలో డాక్టరుకు మాత్రమే రామదర్శనము జరిగింది.*

*కలో, నిజమో నమ్మలేకపొయాడు డాక్టరు.*

*ఆ ఇద్దరి అజ్ఞానమును, బాబా అంజనము వేసినట్లు తొలగించారు.*

*ఆ యిద్దరికీ తమ గురువుగా, తమ ఇష్ట దైవంగా దర్శనమిచ్చి అలభ్యమైన సుఖశాంతులు ప్రసాదించారు.*

*సాయిబాబా సకల దేవతాస్వరూపునిగా, సద్గురుమూర్తిగా, ఇంకా అనేక సంఘటనలలో దర్శనమిచ్చారు.*

*ఆ దర్శనం ద్వారా వారిద్దరికీ చిరకాల ఆనందము లభించింది.*


*మనసును మనకు తోచిన కట్టుబాట్లలో ఉంచరాదు.*


*భక్తి సామ్రాజ్యము ఎంతో విస్తారమైనది.*

*మనసు భక్తి సామ్రాజ్యంలో విహరించాలిగాని, కుంచించుకు పోరాదు.*

No comments:

Post a Comment