*మహారాష్ట్ర నాందేడ్ లో అమీరుద్దీన్ అని సూఫీ ఫకీరు ఉండెడివాడు.*
*ఒకరోజు రాత్రి ఆయన నిద్రిస్తుండగా ఒక కల వచ్చింది.*
*ఆ కలలో షిరిడీ సాయిబాబా స్వప్న దర్శనమిచ్చి, రెండు మామిడి పళ్ళను ప్రసాదించి, తన వద్ద శిష్యునిగా వున్న అబ్దుల్ అనే వ్యక్తి తో ఆ పండ్లను షిరిడీలో వున్న తన వద్దకు పంపమని అదేశించారు. అమీరుద్దీన్ అలాగునే అబ్దుల్ ను షిరిడీ కి పంపాడు.*
*అబ్దుల్ షిరిడీకి రాగానే*
*" నా కాకి వచ్చింది " అని సాయిబాబా పలికాడు అబ్దుల్ తో " నీకు ఇంకేమి పని వద్దు. నా సేవ చేయి చాలు " అని అన్నారు సాయి.* *అబ్దుల్ సాయిబాబా చెప్పిన పనిని తూ.చ. తప్పక పాటించేవాడు.*
*రోజూ మశీదు (ద్వారకామాయి ) ఆవరణను, బాబా నడయాడే వీధులను, ప్రదేశాలను శుభ్రము చేసెడివాడు.*
*అబ్దుల్ లెండి వనములోను, చావడిలోను, మసీదులోను దీపాలు వెలిగించెడివాడు.*
*తాను భిక్షచేసి ఉదర పోషణ చేసుకునేవాడు. అనగా సాయిబాబా వలె భిక్షాటన చేసికొనెడివాడు.*
*ఎల్లవేళలా బాబా వెలిగించిన*
*" ధునిని "* *పర్యవేక్షించెడివాడు.*
*కొన్నాళ్లకు అబ్దుల్ కు వివాహమైనది.*
*సాయిబాబా చెంతనే ఉండి సేవ చేస్తూ ప్రతిరోజూ మూడు సార్లు స్నానం చేసేవాడు.*
*అబ్దుల్ సాయిబాబా పలికిన విషయాలను ఒక గ్రంథములో వ్రాసుకొన్నాడు.*
*సాయి యే ఆ పలుకులను వ్రాయించుకొన్నాడని అన్నది నిజం.*
*ఆ గ్రంథము ఇంతవరకు ముద్రణకు నోచుకోలేదు.*
*సాయిబాబా మహాసమాధి అనంతరం, ఒక రోజు అబ్దుల్ తన ఇంటిలో ఖురాను గ్రంథ పారాయణ చేసుకొంటున్నప్పుడు, శిధిలావస్థ లోనున్న ఆ ఇల్లు మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి.*
*నడుమువరకు ఆ మట్టి గోడల శిథిలాల్లో అబ్దుల్ ఇరుక్కుపోయాడు.*
*అయినా సాయిబాబా కృపచే యే విధమైన ప్రమాదము జరుగలేదు.*
*అది బాబా కృప.*
*అబ్దుల్ బాబా సమాధి అనంతరం అబ్దుల్ బాబాగా పిలవబడినాడు.*
*అబ్దుల్ బాబా, సాయి బాబా సమాధి పూర్వము మరియు అనంతరం 65 ఏళ్లు సేవ చేసిన మహనీయుడు.*
*అబ్దుల్ బాబా 1954 సం ఏప్రియల్ నెలలో సమాధి చెంది సాయిబాబా లో ఐక్యమయ్యాడు*
*ఆయన సమాధి లెండి తోట ప్రాంగణములో కలదు.*
*" స్వల్పంగా తిను, ఒక్క పదార్ధంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు అతిగా నిద్రపోవద్దు " అని అబ్దుల్ తో సాయిబాబా అనెడివారు.*
No comments:
Post a Comment