Wednesday, May 15, 2024

నా తల్లి పుట్టిల్లు భీమా నది తీరంలోని పండరీపురం. నా తల్లి తండ్రులు విట్టల్ రఖుమాబాయి ... అంటూ తల్లి, పుట్టిల్లును తలచుకొంటూ శరణు పొందుతున్నాను" అని అంటాడు సంత్ ఏకనాధ్ మహరాజ్ ఒక అభంగంలో.* *అంతటి అనన్య శరణాగతి ఏకనాథునిది.*

 *మసీదు నా పుట్టిల్లు.*


*" నా తల్లి పుట్టిల్లు భీమా నది తీరంలోని పండరీపురం. నా తల్లి తండ్రులు విట్టల్ రఖుమాబాయి ... అంటూ తల్లి, పుట్టిల్లును తలచుకొంటూ శరణు పొందుతున్నాను" అని అంటాడు సంత్ ఏకనాధ్ మహరాజ్ ఒక అభంగంలో.*

*అంతటి అనన్య శరణాగతి ఏకనాథునిది.*


*అంతటి శరణ్యమే సాయి భక్తుడైన మాధవరావ్ దేశ పాండే (శ్యామా ) లోనూ కనిపిస్తుంది.*

*చిటికెన వ్రేలుకు పాము కాటేసింది. సాంప్రదాయక వైద్యానికి పోకుండా సాయిబాబా వద్దకి వచ్చాడు శ్యామా.*

*బాబా మశీదు మెట్లు ఎక్కవద్దనీ శాసించాడు."* 


*మశీదు నా పుట్టిల్లు,  నేను సాయికి కన్న కొడుకును. మరి కన్న తల్లే బిడ్డను ఈరోజు అంతగా కోప్పడుతుంది ఎందుకు ?*

*పాము కాటు వేసింది అన్న వేదనను తల్లి దగ్గర కాక మరెవ్వరి దగ్గర చెప్పుకొంటాం ?*

 *ఆ కన్న తల్లే తరిమేస్తే ఇక నా గతేంటి ? " అని దీనంగా మొహం పెట్టాడు.*


*అవును ఏకనాధుని వలె ద్వారకామాయియే తన పుట్టిల్లు అని ధైర్యంగా పలికిన ధన్య జీవి.*


*ఈ ఒక్క సంఘటనే గీటురాయి ఆయన జీవితంలో.*

 *స్నేహం విషయానికి వస్తే, బాబాను స్నేహితుడిగా భావించాడు శ్యామా.*

*కానీ ఆ స్నేహబంధంను ఒక్కొక్కసారి హద్దు దాటిపోతుంది. ఇది శ్యామా బలహీనత కాదు. సాయి శక్తి పై శ్యామాకు ఉన్న భరోసా.*

*మొదట్లో సాయి అంటే శ్యామాకు నమ్మకం లేదు.* *సాయిబాబా వివిధ భాషలలో మాట్లాడడం, తాను దర్శింపబోయిన ఆనందనాధ్ మహరాజ్ స్వయంగా వచ్చి బాబాను దర్శించుకోవడం, మున్నగు అనేక మహిమలు సాయినాథుని వైపు శ్యామాను లాగివేసాయి.*


*బాబాతో అత్యంత సన్నిహితంగా ఉన్నా బాబాను శ్యామా " దేవా ! " అని సంభోదించేవాడు. సాయి సచ్చరిత్రలోని సంఘటనలు దాదాపు సగం వరకు శ్యామాతో ప్రమేయం ఉన్నవే.*

*ఈయనకు భక్తుల అనుభవాలతో ఉత్సహము ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.*

*అవి భక్తులలోని వివిధ అంశాలను తెలుసుకొనేందుకు వీలు కలిగించింది.*


*ఉదాహరణకి - నానాసాబ్ చంద్రోర్కర్ బాహ్య సౌందర్యం చూసి పరవశించిన సంఘటన, శ్యామా నానాను ప్రశ్నించనిదే బయటకి తెలిసేది కాదు.*


 *మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా 16 -4 -1944 సం.లో సాయినాధునిలో ఐక్యము అయ్యాడు.*


*శ్యామాకు ఉన్న సఖ్యత మనకు బాబా వద్ద లభించు గాక !*


   *సేకరణ - సాయి @ 366 నుండి.*

No comments:

Post a Comment