*సాయిబాబా అక్టోబర్ 15 - 1918 నాడు మహా సమాధి చెందారు. సాయి చిత్రపటం, సాయి సమాధి ఆరాధనీయమైనది.*
*సాయి భక్తుడు శ్రీ స్వామి కేశవయ్య జీ. ఆయిన గృహమేసాయి నిలయం. అది మద్రాస్ మహానగరంలో షెనాయ్ నగర్ లో ఉన్నది.*
*సాయి నిలయం నుండి గురువారం పూజలు జరుగుతూ ఉండేవి. తగినంత స్థలము లేకపోవుట వలన కొన్ని గంటలసేపు భక్తులు వీధిలోనే క్యూలోనే నిలబడేవారు.*
*ఈ అసౌకర్యము తీర్చడానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో సాయి నిలయం ఏర్పాటు చేశారు.*
*మార్చి 14 1975 సంవత్సరంలో వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రారంభోత్సవం జరిగినది.*
*షెనాయినగర్ సాయి నిలయం ఆనాడే రెండవ శిరిడీగా పేరు గడించుకున్నది.*
*ఆనాడే మూడున్నర లక్షలు రూపాయలు వ్యయంతో రూపుదాల్చిన ఈ మందిరము చూడ చక్కని ప్రశాంత ప్రదాయిని.*
*ఒకేసారి వెయ్యి మంది దర్శించుకో దగ్గ హాలు ఉన్నది.*
*చక్కని పాలరాళ్లతో నిర్మితమైన గర్భాలయంలో, అంతకంటే చక్కని మందహాసంతో జగదేక పూజితుడైన శ్రీ సాయిబాబా నిలువెత్తు చిత్రపటం ఉంచారు.*
*సాయి పటం ముందు షిరిడీలో వలె పాదుకలు ఉంచబడ్డాయి.*
*ఒక మాటలో చెప్పాలంటే జీవకళతో ఉట్టిపడే శ్రీ సాయిబాబా పటం భక్తుల హృదయాల్లో నిశ్చలమైన భక్తి భావము కలిగించేది.*
*ఈ మందిర నిర్మాణంలో ఉన్న రోజుల్లో, ఈ మందిరాన్ని తిలకించిన ప్రముఖ వైద్యులు శ్రీ సురేంద్ర గారు ఇలా అనుకున్నారు " స్వామి కేశవయ్య జీ అనంతరం ఈ మందిరము ఏమవుతుందో, ఏమిటో అని.*
*ఆ రాత్రి ఆయనకు కల వచ్చినది. సాయిబాబా కలలో కనిపించి ''వెర్రివా డా ! నా భక్తులను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళతాను? కంటికి రెప్పలాగా నేను వాళ్లను కాపాడుతూ ఉంటాను. నేను ఆ మందిరంలోనే ఉంటాను" అంటూ శ్రీ సాయిబాబా మందిరములోకి ప్రవేశించి ఆసీనులైనారట.*
*నేటికీ, సాయిబాబా ఆ సుందర దివ్య చిత్రపటంలోనే సాక్షాత్కరిస్తుంటారు.*
*(ఇప్పటికీ ఆ మందిరంలో విగ్రహం లేదు) ఆనాడు-ఈనాడు సాయి వెన్నెల వ్యాపిస్తూ ఉంటుంది.ఈరోజు మార్చి 14- ఆ సాయి నిలయము లో వలె సాయి మనలో ఉండు గాక!*
*జై సాయినాథ*
No comments:
Post a Comment