Tuesday, May 14, 2024

షిరిడీలో జరిగిన మొదటి శ్రీరామనవమి.* *మొదటిసారిగా శ్రీ రామనవమి ఉత్సవం 1911 సం .లో షిరిడీలో సాయినాథుని సన్నిధిలో భక్తులచే జరుపబడినది.*

 *షిరిడీలో జరిగిన మొదటి శ్రీరామనవమి.*


*మొదటిసారిగా శ్రీ రామనవమి ఉత్సవం 1911 సం .లో షిరిడీలో సాయినాథుని సన్నిధిలో భక్తులచే జరుపబడినది.*

*అనగా రామ జన్మోత్సవం జరుపబడినది.*

*సాయిబాబా అవతార కార్యక్రమం హిందూ ముస్లిం సమైక్యత.*


 *1897 సం. లో శ్రీరామ నవమినాడు మొదటి సారిగా ఉరుసు ఉత్సవాన్ని బాబా ద్వారకా మాయిలో ప్రారంభింప చేశారు.*

*అదే పునాది.*


*సాయిబాబా ముస్లింగా కనిపించినా మద్రాసు భజన సమాజ్ మహిళ అరుంధతీ అమ్మాళ్ కు రామునిగా సాక్షత్కరించాడు .*

*రామభక్తుడైన డాక్టరు కు రామునిగా దర్శనమిచ్చాడు.*


*భక్తులకు భావార్థ రామాయణం, ఆధ్యాత్మ రామాయణము, పారాయణము చేయమని అదేశించారు.*


*బాబా మహసమాధికి ముందు తాను స్వయముగా వజే అను భక్తునితో రామవిజయం అను గ్రంథాన్ని మూడుసార్లు పారాయణ చేయించుకున్నారు.*


*ఉపాసనీ మహరాజ్ తాను రచించిన " సాయినాథ మహిమ స్తోత్రం " లో సాయిరూప ధర రాఘవోత్తమం అని కీర్తింపబడినాడు.*


*ఈ కలియుగములొ ఆ శ్రీరాముడే సాయిరాముడై అందరినీ అనుగ్రహిస్తున్నారు.*


*సాయి గురు బంధులందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.*


*జై సాయిరామ్.*

No comments:

Post a Comment