Wednesday, May 15, 2024

రావుసాహెబ్ సాఠే, బాపూ సాబ్ జోగ్, యస్వంతరావు బోర్వెకే అవతార్ మెహర్ బాబా, దుర్గా బాయి మున్నగువారు విచ్చేసారు.

 *ప్రసాదప్రాప్తి.*


*సాయిబాబా వర్ధంతి కార్యక్రమాలను కాశీలో జరుపుదామని ఉపాసనీ బాబాకు ఆలోచన వచ్చింది.*


*1920 సం. ఏప్రియల్ నెలలో హనుమజ్జయంతి కి ఆ కార్యక్రమాలు ముగిసాయి.*

*11 రోజులు పాటు ఘనంగా జరిగిన ఆ కార్యక్రమాలు ఏప్రియల్ 3 వ తేదీ 1920 సం. హనుమజ్జయంతి తో ముగిసినవి.*


*12 వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమము ఉన్నది.*

*దానికి రావుసాహెబ్ సాఠే, బాపూ సాబ్ జోగ్, యస్వంతరావు బోర్వెకే అవతార్ మెహర్ బాబా, దుర్గా బాయి మున్నగువారు విచ్చేసారు.*

*ఉపాసనీ మహరాజ్ అందుకుగాను కాశీలో ఒక హనుమాన్ మందిరం వద్ద ఏర్పాట్లు చేయించారు.*

*శతచండీ యాగాన్ని నిర్వహించారు.* 

*నలభై మంది బ్రాహ్మణులతో భగవద్గీత, రామగీత, సప్తశతి, ఆధ్యాత్మ రామాయణం, విష్ణు సహస్రనామం పారాయణ చేయించారు,* *ఉపాసనీ మహారాజ్ గారి పర్యవేక్షణలో.*


*సాయిబాబా ఇతర గురువులకు ఉత్తర క్రియలు జరిపించారాయన.*


*పరిసమాప్తి కార్యక్రమముగా అన్నదానం ఏర్పాటు చేశారు.*

*కాశీలో కొన్నివేలమందికి సంతర్పణ ఏర్పాట్లు ఘనంగా చేశారు.*

*సంతర్పణ ప్రదేశములో సాయిబాబా వారి పెద్ద చిత్రపటాన్ని కన్నులపండుగగా దర్శించేటట్లు ఏర్పాటు చేశారు.*

*సాయిబాబా ఫోటోను చూసిన కొందరు ఛాందసులు "సాయిబాబా మహ్మదీయుడు. మహ్మదీయుడు పేరున జరిగే అన్న సంతర్పణలో మేము భుజించము " అని అన్నారు.* 

*వారిని చూసి మిగతావారు వంత పాడారు. ఇది ఉపసనీబాబా కు అగ్ని పరీక్ష వంటిది. ఉపాసనీ బాబా వారితో, తానూ ఒక బ్రాహ్మణుడుననీ, సద్గురుమూర్తి శ్రీ సాయిబాబా సకల మతాతీతుడనీ ఎంతగానో నచ్చచెప్పాడు.*

*కానీ ఆ బ్రాహ్మణులందరూ ఒకే మాట మీద ఉన్నారు.*

*ఉపాసనీ వారితో, వారికిచ్చే దక్షిణ 5 రూపాయలు బదులు 15 రూపాయలు ఇస్తానని అన్నారు.*

*వారు కాస్త మెత్తబడ్డారు. సాయి ఫొటోను అక్కడనుంచి దించితే చాలు అని అడిగారు.* 

*ఉపాసనీ మహరాజ్ కు వారు చెప్పినది అంగీకరించలేదు.* 

*బాబా ఫొటొ యే కదా కొంచెంసేపు పక్కన పెడదాం అని ఆలోచనే ఉపాసనికి రాలేదు.*

*సాక్షాత్ పరబ్రహ్మ స్థానంలో వున్న సాయిబాబా ను నేలబారుగా దిగజార్చడానికి ఒప్పుకోలేదు.*


*ఆ బ్రాహ్మణులతో  " మీరు భోజనము చేయకపోయినా పర్వాలేదు " అని గంగ ఒడ్డున అన్నదానం జరుగుతుందని, భోజనానికి రమ్మని ఊళ్ళో చాటింపు చేయించాడు.*

*ఆ చాటింపు విని వూళ్ళో నుండి షుమారు 15 వేలమంది వచ్చి భోజనం చేశారు.* 

*కాశీ బ్రాహ్మణులు బేరానికి వచ్చారు. వారికి ఉపాసనీ మహరాజ్ లొంగలేదు.*

 *సాయి ప్రసాదం ఏవరికి ప్రాప్తమో ఎవరికి ఎరుక ?*


 *సాయి @ 366 నుండి.*

No comments:

Post a Comment