*" కలౌ నామ సంకీర్తనం " అన్నారు పెద్దలు.*
*అనగా కలియుగములో జప, తప, యజ్ఞ యాగాదులు చేయుట కష్టతరమని, భగవన్నామ సంకీర్తన ద్వారా మోక్షము సంపాదించవచ్చని దాని భావం.*
*అయితే సంకీర్తన అంటే ఏమిటీ ? ప్రతి సగుణ రూపానికి ఒక నామము ఉంటుంది.*
*దానిని పలకటం జరిగినప్పుడు, వెంటవెంటనే ఆ నామానికి మూలమైన రూపం కనులముందు నిలవాలి.*
*వెంటనే ఆ రూపంలో నిబిడీకృతమైన శక్తి ఎంతటిదో, దాని విశ్వరూపం మనకి గొచరించాలి.*
*అలా నామ రూప తత్వాలు మూడు కలసి చేసేదే నామ సంకీర్తనం.*
*అంతేగానీ అయిదు వాద్యాలు అమర్చుకుని, రాగం తప్పకుండా చూసుకొంటూ, ఎవరు బాగా చెపుతున్నారో, పాడుతున్నారో పరిశీలించి బేరీజు వేసుకొంటూ, ఆనాటి సంకీర్తన కార్యక్రమము ద్వారా తనకెంత డబ్బు ముట్టుతుందొ అలోచించుకొంటూ చేసేదీ సంకీర్తన కాదు.*
No comments:
Post a Comment