ఓం శ్రీ సాయిరాం
శ్రీ శివనేశన్ స్వామీజీ
పూజ్యాయ ధర్మ పాదాయ సైతత్వ వ్రతాయచ
సదాశివాయ శాంతాయ శ్రీ శివనేశన్ స్వామి
గురుభ్యోనమః🙏🙏
శివనేశన్ స్వామీజీ ఏప్రిల్ 12, 1927 (శ్రీరామనవమి రోజున..)కోయంబత్తూరు జిల్లాలోని నాయకర్‌పాళయంలో జన్మించారు.
తల్లిదండ్రులు అలమేలు - ముత్తయ్య. స్వామీజీ ఆ దంపతులకు మూడవ (చివరి) సంతానం..జన్మించినప్పుడే స్వామికి రెండు ముందు దంతాలు, తల వెనుక భాగంలో చిన్న జుట్టుతో కూడిన కుచ్చు (జాత)ఉన్నాయని చెబుతారు. అతను గృహస్థు జీవితాన్ని గడపడని సన్యాసి అవుతాడని జ్యోతిష్యులు ముందే చెప్పారు..
స్వామీ చదువుకున్నది ఎనిమిదో తరగతి వరకు మాత్రమే.. ఆర్థిక పరిస్థితి బాగాలేక కాదు..అతనికి లౌకిక జ్ఞానం మీద శ్రద్ధ లేక..శివనేశన్ స్వామీజీ తన యవ్వనంలో కొద్దికాలం తాత్కాలికంగా మద్రాసు హైకోర్టులో రికార్డ్ రూమ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో కొంతకాలంపాటు విద్యుత్ శాఖలో రోజువారీ కూలీకి హెల్పర్‌గా పనిచేశారు.
తల్లి మరణించిన తరువాత తన ఇంటిని విడిచిపెట్టారు. 17 సం:లు వయస్సులో బొంబాయి చేరుకున్నారు. తన జీవనోపాధి కోసం అనేక ఉద్యోగాలు చేశారు..
బొంబాయిని విడిచిపెట్టి నిత్యానంద ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. అక్కడి నుంచి నాసిక్‌కి, 1953లో మొట్ట మొదటిసారి షిర్డీ ద్వారకామాయిలోకి అడుగుపెట్టగానే మనస్సు శాంతించి తాను నివసించవలసిన ప్రదేశం ఇదేనని అర్థం చేసుకున్నారు.
షిర్డీలో అతని దినచర్య...సేవ.. షిర్డీలోని ప్రతి ఆలయాన్ని శుభ్రం చేసేవారు...అతనికి ఇష్టమైన ద్వారకామాయి ఆయన శుభ్రం చేసిన తర్వాత బంగారంలా మెరిసేది.
గురుస్థాన్..నందాదీపం..దత్త మందిరాలను కూడా శుభ్రపరిచేవారు. బాబా ఫోటోలు, అనేక దేవతల ఫోటోలపై చందనం..తిలకం..పూసేవారు. అన్నిచోట్లా సాయంత్రం దీపాలు వెలిగించేవారు.
స్వామి ప్రతిరోజు ఉదయం గం.3-00 నుండి గురుస్థానం.. దత్త మందిరం.. నందాదీపం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు.. ఎవరైనా భక్తులు ఆరోగ్య రూపేణా కానీ.. ఇంకా ఏదైనా సమస్యలున్నా స్వామిని పరిష్కారం అడుగగా..వారికి ప్రదక్షణలు చేయమని సలహా ఇచ్చేవారు.
తనని కలిసిన సాయి భక్తులకి ఆలయాలు నిర్మించమని.. అనుభవాలు వ్రాయమని.. సత్సంగం చేయమని.. నామ జపం చేయమని చెప్పేవారు..ఎవరైనా భక్తులు దక్షిణ ఇస్తే పుస్తకాలు కొనడానికి లేదా పేదలకు ఆహారం కొనడానికి ఉపయోగించేవారు..
సాయినాథుని గురించి మరింత తెలుసుకోవడానికి మరాఠీలోని సాయిలీలా మ్యాగజైన్‌ల పాత సంచికలను సంస్థాన్ లైబ్రరీలో తీసుకొని చదివేవారు...స్వామీజీ పుస్తకాలు బాగా చదివేవారు.. బహుభాషా వేత్త.. సుమారు పది భాషల వరకు స్వామీజీకి తెలుసు.. కాబట్టే ఎవరైనా స్వామీజీతో సత్సంగాన్ని నిర్వహించేవారు..
ఇంగ్లీషు, మరాఠీతో పాటు అనేక దక్షిణ భారత భాషలతో పాటు పలు భాషలు వీరికి తెలియగానే... సాయి సంస్థానం వారు మనీ ఆర్డర్లు పంపే భక్తులకు యూడీఐని 'ప్రసాదం'గా పంపేందుకు ఉపయోగించే కవరుపై పేర్లు, చిరునామాలు రాసే పనిని స్వామికి అప్పగించారు. అప్పుడు సంస్థాన్ వారు అతనికి నెలకు రూ.15/-లు వేతనం ఇచ్చేవారు. గురువారాలలో పల్లకీ ఊరేగింపు కోసం ప్రత్యేకంగా చావడిని అలంకరించేవారు.
సాయంత్రం ఆరతి అనంతరం గంటసేపు చావడిలో భజనలు చేసేవారు. స్వామీజీకి షిరిడీలో జీవితం అంత సుఖంగా ఉండేది కాదు... స్వామీజీ గురువు అతనిని భిక్షాటన చేయకూడదని నియమం విధించారు. కాబట్టే అతను నియమాన్ని ఉల్లంఘించకుండా ఆకలితో, ఉండటానికి స్థలం కూడా లేకుండా గడిపేవారు...
స్వామీజీ అంకిత సేవకి ఫలితంగా సంస్థానం నుండి ఆహారాన్ని.. ద్వారకామాయికి ఆనుకుని ఉన్న గదిలో నిద్రించడానికి సాయి సంస్థానం వారు అనుమతిచ్చారు..
స్వామీజీ ఫిబ్రవరి 12, 1996లో సోమవారం గం.10-00 గంటలకు షిర్డీలో అనారోగ్యంతో మహాసమాధి పొందారు..
స్వామిజీ మహామాధిని షిర్డీలో సంస్థాన్ ప్రసాదాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో...పింపుల్‌వాడి రోడ్డులో..మెహర్ ధున్ ఎండోమెంట్ భూమిలో ఆయన భక్తులు నిర్మించారు.
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment