ఓం శ్రీ సాయిరాం🙏🙏
ఖండోబా మందిరం.. షిరిడి..
మహారాష్ట్ర ప్రజలు భక్తితో కొలిచే దేవుళ్ళలో పాండురంగ విఠలుడు..ఖండోబా..(వీరభద్ర స్వామి.. పరమేశ్వరుని అవతారం..). పర మల్హారి.. స్కందోబా.. ఖండేరావ్.. మహల్సాకాంత్.. అనే పేర్లతో ఖండోబాను పూజిస్తారు..
పూజారి మహల్సాపతి "రండి సాయి!" అని పిలిచిన చోటు..
సద్గురు అవతార కార్యానికి నాంది పలికిన రంగస్థలం..
ఈ మందిరం షిరిడి బస్టాండ్ ఎదురు శ్రీ సాయినాథ హాస్పిటల్ గోడ ప్రక్కగా ఉంది..
భక్తులకు భవరోగ చికిత్స చేసేందుకు బాబా రెండవసారి షిరిడీలో అడుగుపెట్టిన చోట ఆసుపత్రి ఉండటం విశేషం..
ఈ ఆలయం నాలుగైదు దశాబ్దాల నాటిది.. ఇందులో ఖండోబా విగ్రహం ఉంది. మహల్సాదేవి, బనాయి (పార్వతీదేవి...గంగ..) ఆయన దేవేరులు..
మహల్సాపతి వంశీయులు ఈ ఆలయ పూజారులు..
బాబా రహతా వెళ్లి వచ్చేటప్పుడు ఈ మందిరం దగ్గర మహల్సాపతిని పలకరించేవారు..
ఉపాసనీ బాబాను ఈ మందిరంలో నాలుగు సంవత్సరాలు ఉండమన్నారు బాబా..
ఆయన కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నారు..
ఉపాసనీ బాబా ఆదేశం మేరకు మెహర్ బాబా కూడా ఇక్కడ కొంత కాలం ఉన్నారు..
ఈ విధంగా ఎంతోమంది మహనీయులు దర్శించిన ఆలయమిది..
ఇక్కడ బాబా నిలువెత్తు విగ్రహంతో పాటు... మహల్సాపతి..ఆయన కుమారుడు మార్తాండ్.. ఉపాసనీ బాబా చిత్రాలతో పాటు, సాయిభక్తులందరి చిత్రాలను కూడా చూడవచ్చు..
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment