ఓం శ్రీ సాయిరాం 🙏 🙏
సాయి శరణానంద (వామన్ ప్రాణ్ గోవింద్ పటేల్) 1889వ సంవత్సరం, ఏప్రిల్ 5వ తారీఖున సూరత్ జిల్లా...బర్డోలి తాలూకా...మోతా గ్రామంలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
తల్లిదండ్రులు గోవింద దాసు.. మణి గౌరీ.. వీరు బాబా భక్తులు..
శరణానందుల వారికి 3సం:ల వయసులో అనారోగ్యం రాగా ఒక ఫకీరు వారి ఇంటికి వచ్చి ఊది ఇచ్చి.. ఈ బాలుడికి కుడివైపున మచ్చ ఉంది "సత్పురుషుడు" అవుతాడని దీవించి వెళ్లారు..
ప్రాధమిక విద్య మోతా...సూరత్, అహ్మదాబాద్ లో..1910లో బొంబాయి ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో B.A చేసి, 1911లో ఎల్.ఎల్.బి పరీక్షలో ఉత్తీర్ణులైనారు..లాయర్ పరీక్ష పాసయ్యాక
కళావతి అనే అమ్మాయిని పెళ్ళాడారు.
1904లో తండ్రితో కలిసి బొంబాయిలో ఉన్న శ్రీ అక్కల్కోట్ మహారాజు గారి శిష్యులు శ్రీ బాలకృష్ణ మహారాజ్ గారిని దర్శించుకోవడానికి వెళ్లి వారితో.. "నేను భగవంతుడితో ముఖాముఖిగా చూసేలా చేసే సాధువును మాత్రమే గురువుగా స్వీకరిస్తాను!" అన్నారు.
బాలకృష్ణ మహారాజ్ గారు వారికి రెండు పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు.. అందులో ఒకటి అక్కల్కోట్ మహారాజ్ గారి చరిత్ర.. రెండు ఏకనాథ భాగవతం..
1911లో ఖేడా జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్న H.V.సాఠే గారితో వీరి తండ్రి గారికి పరిచయం ఏర్పడింది.
అప్పట్లో షిరిడిలో చిన్న హోటల్ నడుపుతున్న నానా సాహెబ్ చాందోర్కర్ గారి బంధువు బాలాభౌ చాందోర్కర్ గారికి పరిచయ ఉత్తరం రాసి.. 1911 మే నెలలో శ్రీ గోవిందదాసుగారిని.. వారి స్నేహితులు శ్రీ సాకర్‌లాల్ కేశవరామ్ భట్టు గారిని షిరిడికి పంపించారు.
1911, డిసెంబరు 10వ తారీఖున (22సం:లు)తన ఎల్.ఎల్.బి పరీక్ష అవగానే తండ్రి ప్రోద్బలంపై శరణానందుల వారు శిరిడీ వెళ్ళాడు. అప్పటినుంచి శ్రీసాయి మహాసమాధి చెందేవరకు శరణానంద తరచూ శిరిడీ వెళ్ళి వస్తుండేవాడు.
1913లో ఇతను శిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతన్ని 11 నెలలు ఉంచేసి.. భిక్షకోసం 4, 5 ఇండ్లకు పంపేవారు.
1917 మార్చిలో అహ్మదాబాద్ లోని మోడల్ హైస్కూల్లో హెడ్మాస్టర్ గా.. కాలేజీలో ప్రిన్సిపాల్ గా 1921 జనవరి వరకు పని చేశారు..
1921లో బొంబాయి వెళ్లి.. మెసర్స్ గంగా అండ్ సయానీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసి 1950లో పదవీవిరమణ చేశారు.
1932లో అహ్మదాబాద్ లో బాబా మందిరాన్ని "విష్ణు ధర్మాలయ" అనే పేరుతో నిర్మించి.. ఒక భక్తుడు తనకిచ్చిన పాదుకలని అక్కడ ప్రతిష్టించారు..
1951లో అతని భార్య, ఆ తరువాత కొడుకు, మరికొన్ని సంవత్సరాలకు కుమార్తె మరణించారు.
1953 జూలై 14న డాకోర్‌లో 64 ఏళ్ల వయసులో ఫకీర్‌గా సన్యాసం స్వీకరించి..సాయి శరణానందగా పేరు పొందారు.
1950-53 ల మధ్య ఈయన గుజరాతీ భాషలో 14 అమూల్యమైన గ్రంథాలు రాశారు. ఈయన రాసిన 'శ్రీసాయిబాబా' అనే పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది...
బాబాపై “గురుస్మృతి”..1946లో గుజరాతీలో “సాయిబాబా"..1961లో ఆంగ్లంలో "సాయిబాబా ది సూపర్‌మ్యాన్" పుస్తకాలు వ్రాశారు..సాయినాథనే శరణే...బ్రహ్మ పరిమళం.. సిద్ధామృతం..ఇతర రచనలు..
సాయి సమాధి చెందిన 36 సం:ల తర్వాత 1954 అక్టోబర్ 7న (విజయదశమి రోజు ) ప్రస్తుతం సమాధి మందిరంలో కొలువైన సాయినాధుని విగ్రహాన్ని శరణానందులవారు సన్యాసి కావడంతో ప్రతిష్ఠించటానికి అవకాశం లేకపోయింది...బాబా విగ్రహం మీద తెరను తొలగించిన ఘనత మాత్రం ఆయనకు దక్కింది.
బాబాకు,బాబాభక్తులకు చాలా సంవత్సరాలు సేవ చేసిన తరువాత, సాయి శరణానంద 1982 ఆగస్టు 25న (93సం:లు) అహ్మదాబాద్ లో బాబాలో ఐక్యమయ్యారు.
సాయి శరణానందగారి సమాధి ఆలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ పట్టణంలో ఉంది..
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment