Saturday, June 8, 2024

అది మరచిపోరాని అపూర్వ ఘట్టం. దీనికి పూర్వమే ఈ నామస్మరణ కార్యక్రమానికి నాందిగా కీ. శే. శంకరయ్య గారు సికింద్రాబాద్ నందు గల తన గృహంలో సాయి నామ సంకీర్తన 1982 సం. సంక్రాంతి రోజున జరిగింది.

*ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి.*


*భగవన్నామ స్మరణం ప్రాశస్త్యం వర్ణన విశేషంగా శివాజీ మహరాజ్ గురువైన శ్రీ సమర్థ రామదాసు గారు తాను రచించిన "దాసబోధ " గ్రంధంలో తెలిపారు.*

*షిరిడీలో సాయినాధునికి అనంత నామములున్నవి. ఏ నామమునకు ఆ నామమే సాటి.*
*సాయిబాబా కూడా నామ స్మరణను ఎంతో ప్రోత్సహించారు.*

*ఒకప్పుడు షిరిడీలో సాయి భక్తులైన కీ. శే. ఎం. జగన్నాధం, మరియు కీ. శే డి. శంకరయ్య గారి నిర్వహణలో* 
*10 -6 - 1982 నుండి*
 *17 - 6 -1982 వరకు " ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి " నామ స్మరణ ఏడు రోజులు ఏకధాటిగా, నిర్విఘ్నంగా జయప్రదంగా నిర్వహించారు.*

*అది మరచిపోరాని అపూర్వ ఘట్టం. దీనికి పూర్వమే ఈ నామస్మరణ కార్యక్రమానికి నాందిగా కీ. శే. శంకరయ్య గారు సికింద్రాబాద్ నందు గల తన గృహంలో సాయి నామ సంకీర్తన 1982 సం. సంక్రాంతి రోజున జరిగింది.*

*షిరిడీలో జరిగిన నామ సప్తాహా కార్యక్రమము పాత ఏంక్వైరీ ఆఫిసులో జరిగింది.*
*ఆ సప్తాహ నామస్మరణలో భక్తుల గ్రూపులు, గ్రూపులుగా ప్రతీ నాలుగు గంటలు లేదా ప్రతీ ఆరు గంటల కొకసారి మారుతూ సాయి నామ సంకీర్తన చేసారు.*

*అందరికీ వసతి అన్న పానీయాల సౌకర్యాలు నిర్వాహకులే తగువిధంగా ఏర్పాటు చేశారు.*

*అదే సమయములో అప్పటి రాష్ట్రపతి కీ. శే. నీలం సంజీవ రెడ్డి గారు షిరిడీ సాయి దర్శనానికి రావటం జరిగింది.* 

*షిరిడీలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగడానికి, సాయి సేవక్ గా పేరొందిన* 
*కీ. శే. శివనేశన్ స్వామి గారు, అనసూయ మాత (పరాడ్ సింగ ) అశీస్సులు లభించాయి.*

*షిరిడీ సమీపంలో, సాకోరి ఉపాసనీ మహరాజ్ ఆశ్రమము నుండి గోదావరి మాత తన శిష్య బృందంతో ఈ సప్తాహ నామ స్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.*
*ఆమెకు సాయినాథుని మెమొంటో బహుకరించారు.* 

*ఇక షిరిడీలో జరిగిన, ఈ నామ సంకీర్తన ఒక ప్రోత్సహ కర సంఘటనగా మారి భక్తులు " ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి " నామాన్ని అనేక చోట్ల శ్రద్దతో చేయడం కనిపించింది.*

*"ఓం శ్రీసాయి జయ జయ సాయి " ద్వాదశ అక్షర మహా మంత్ర సమానం.*
*ఈ మంత్రం ఏ ఒక్కరి వల్లోనో పుట్టి,ఏ ఒక్కరి వల్లనో ప్రచారం జరగలేదు.*

*శ్రీ సాయి అనుగ్రహంతో ఆవిర్భవించి, నేడు విశ్వమంతా ప్రపంచ దేశాలలో భక్తులు జపిస్తున్న ద్వాదశాక్షరి మహా మంత్రం.*

 *"ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి " మన నిత్య జపంగా నిలచిపోవును గాక*

No comments:

Post a Comment