ఓం శ్రీ సాయిరాం🙏🙏
మహల్సాపతి గృహం... షిరిడి..
బాబా ఇతనిని ప్రేమగా 'భగత్' అనీ, 'సోనార్‌డా' అని పిలిచేవారు. ఇతని పూర్తిపేరు మహల్సాపతి చిమ్నాజీ నాగరే.
శిరిడీ గ్రామానికి చెందిన పేద విశ్వబ్రాహ్మణ కుటుంబంలో (సుమారు 1834లో) జన్మించాడు. వంశపారంపర్యంగా తమ కులదైవమైన ఖండోబా (ఖండోబాకే మహల్సాపతి అని మరో పేరు. ‘మహల్సా’ అంటే పార్వతీదేవి...మహల్సాపతి అంటే పార్వతీపతి, శివుడు అని అర్థం) మందిరంలో అర్చకత్వం చేసేవాడు. ఖండోబాకు సంబంధించిన ‘మహల్సా పురాణం’ ప్రతినిత్యమూ పఠిస్తుండేవాడు...
బాబా అతనిని 'భగత్' ('భక్తా') అని పిలిచేవారు... సాయిభక్తుడు బి.వి.దేవ్ ‘మహల్సాపతి స్మృతులు’ అనే పుస్తకం ముందుమాటలో మహల్సాపతిని 'భక్తమాణిక్యం' అనీ, 'మహాత్మా' అనీ సంబోధించారు...
1922, సెప్టెంబరు 11, భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున సోమవారంనాడు మహల్సాపతి ఎప్పటిలానే ఖండోబాకు, బాబాకు పూజ పూర్తిచేసుకొని, "నేడు నా తండ్రి ఆబ్దికానికి వంట త్వరగా చేయండి. నేడే నేను నా ప్రాపంచిక జీవనాన్ని ముగించి స్వర్గానికి వెళ్తాను" అని అన్నాడు.
పురోహితుడు లక్ష్మణ్ వచ్చి శ్రాద్ధకర్మలు పూర్తిచేశాడు...
మరుసటిరోజు వేకువఝామున మహల్సాపతి 'రామా!' అని ఉచ్ఛరిస్తూ..తన 85వ ఏట 1922, సెప్టెంబరు 12న, ఏకాదశి ఘడియల్లో సాయి పాదాలలో ఐక్యమయ్యాడు.
మహల్సాపతి పార్థివదేహానికి లెండీబాగ్ లో అంత్యక్రియలు నిర్వహించారు.
సాయిభక్త మహల్సాపతి వంశ వృక్షం....
1.మహల్సాపతి,2.మార్తాండ్(2వ తరం), 3.మనోహర్ (3వ తరం), 4. సందీప్ (4వ తరం) & 5. సోహం (5వ & ప్రస్తుత తరం)
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment