Saturday, June 8, 2024

ధుని ముందు కూర్చున్న సాయిబాబా

 ఓం శ్రీ సాయిరాం 



      ..🌹ధుని ముందు కూర్చున్న సాయిబాబా🌹..


             ధుని  ముందు కూర్చుని ఉన్న ఈ ఫోటో  సాయిబాబా ఒరిజినల్ ఫోటో..  ఈ ఫోటోలో బాబా ధునిమాకి ఎదురుగా కూర్చుని తన కుడి చేతిని చెవి పక్కన పెట్టుకుని ఉన్నారు..


        ఈ ఫొటోని 1903లో పూనేకు చెందిన శ్రీ. కాశీనాథ్ గోడే అనే ఫోటోగ్రాఫర్ తీశారు. 


    ఇప్పటికీ దాని నెగిటివ్..ఈ ఫోటో మొదటి ప్రింట్.. అహ్మద్‌నగర్‌లోని సాయిభక్తుడు‌ దామ్ముఅన్నా రస్నే దుకాణంలో ఉంది. 


      ఈ ఫోటో కాపీ మ్యూజియం మేడమీద ఉంది..


       ఈ ఫోటో యొక్క కలర్ పెయింటింగ్‌ను ముంబైకి చెందిన ఒక భక్తుడు వేశారు..


            ఈ పెయింటింగ్ ఫొటోని షిరిడిలో ప్రధాన పండుగల సమయాలలో  ముందు రోజు సమాధి మందిరం నుండి ద్వారకామాయి వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి.. ద్వారకామాయిలో ఉంచి పారాయణం (శ్రీ సాయి సచ్చరిత్ర..) ముగిసిన తర్వాత ఫొటోని తిరిగి ద్వారకామాయి నుండి సమాధి మందిరానికి ఊరేగింపుగా తీసుకువెళ్ళి.. సమాధి మందిరంలో గర్భాలయంలోని చిన్న గాజు మ్యూజియంలో ఉంచుతారు...


     షిర్డీ వెళ్శిన సాయిభక్తులు సమాధి మందిరంలో గర్భగుడి ఎడమ వైపున (బాబా పాదాల వైపు) ఉన్న చిన్న గాజు మ్యూజియం లోపల ఉన్న ఈ ఫోటోను చూడవచ్చు.


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment