ఓం శ్రీ సాయిరాం
శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామీజీ జన్మించిన రోజు..
శ్రీ రాధాకృష్ణ స్వామీజీ 1906 ఏప్రిల్ 15వ తేదీన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని పొయ్యమణి గ్రామంలో జన్మించారు... తల్లిదండ్రులు:- శ్రీ పుదుక్కుడి డి. వెంకటరామ అయ్యర్ - శ్రీమతి లక్ష్మీ అమ్మాళ్ ...ఈ దంపతులకు వీరు ఐదవ సంతానం.
చిన్నతనం నుండి ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగారు. ఎప్పుడూ ప్రకృతి అందాలను ఇష్టపడేవారు. సమీప దేవాలయాలను..సాధు సత్పురుషులను సందర్శించేవారు..
రాఘవేంద్ర స్వామి...సదాశివ బ్రహ్మేంద్ర...చైతన్య మహాప్రభు వంటి సద్గురువుల పుస్తకాలు చదివేవారు...తిరువణ్ణామలైలో రమణ మహర్షిని, శేషాద్రి స్వామిని కలిశారు. కంచి కామకోటి పీఠంలోని జగద్గురు శంకరాచార్యులను దర్శించుకునే అవకాశం లభించింది... స్కూల్ చదువులపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో చదువుకు స్వస్తి పలికారు...
సంపన్న కుటుంబానికి చెందినవారు కాబట్టి.. జీవనోపాధి కోసం సంపాదించాల్సిన అవసరం లేదు కనుక...ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు..
అతని సోదరులలో ఒకరు పూనాలో ఉన్నప్పుడు..పూనా, ముంబై చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలను సందర్శించి..తన ఆధ్యాత్మిక సాధన కోసం కొన్ని గుహలను చూసి..ఒక గుహలో ఉండి 48 రోజులు తపస్సు చేశారు...ఆ సమయంలో అతనికి దత్తాత్రేయ భగవానుని దర్శనభాగ్యం కలిగింది...
రాధాకృష్ణన్ 1921లో ఊటీకి వచ్చారు..20 సం:లు అక్కడే ఉన్నారు. 21 సం:ల వయస్సులో కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి తల్లి బంధువు అయిన పార్వతిని వివాహం చేసుకున్నారు...ఊటీలోని రేస్‌క్లబ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా స్టీవార్డ్‌గా పనిచేశారు..
1927లో ఊటీలో బెట్‌కు చెందిన నారాయణ మహారాజ్‌చే దత్త మంత్ర దీక్షను పొందారు..."మంత్ర మహోదరి" అనే సంస్కృత పుస్తకాన్ని క్రమం తప్పకుండా చదివేవారు...
1936-42లో అతని జీవితంలో జరిగిన దురదృష్టకర సంఘటన మూలంగా మానసిక ఒత్తిడికి గురై..తిరుచ్చి నుంచి మద్రాస్‌కు రైలులో ప్రయాణిస్తూ...రైలు చిదంబరం సమీపంలోని కొలెరూన్ నదిని దాటుతుండగా..నదిలోకి దూకడం కోసం తలుపు తెరిచారు. కానీ తనను ఎవరో వెనక్కి లాగినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసారు.. అక్కడ తలపాగాతో ఉన్న ఒక వృద్ధుడు నీ జీవితంలో చేయవలసి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి.. ఈ ప్రయత్నం మానుకో అని హితవు చెప్పారు..తర్వాత తనను వెనక్కి లాగింది బాబాయే అని గ్రహించారు...
1942లో అనుకోని పరిస్థితుల్లో శ్రీ బి.వి.నరసింహ స్వామీజీని కలిశారు... అక్కడితో ఆయన "గురువు" అన్వేషణ ముగిసింది...బాబాకు గట్టి భక్తుడు అయ్యారు...శ్రీ నరసింహ స్వామీజీకి ఆధ్యాత్మిక వారసుడు అయ్యారు...మద్రాసులో ఉన్నప్పుడు రాధాకృష్ణన్ "ఆల్ ఇండియా సాయి సమాజ్" సంస్థ కార్యకలాపాలు చూసేవారు..
అతను ప్రచారాలకి..ఆడంబరాలకు దూరంగా ఉండేవారు..
తన గురించి మాట్లాడటానికి కనీసం ఫోటో తీయడానికి ఇష్టపడేవారు కాదు..సాయిబాబా గురించి ప్రచారం కోసం ఉత్తర భారతదేశాన్ని సందర్శించారు...
తన గురువుగా శ్రీ నరసింహ స్వామీజీకి సంపూర్ణ శరణాగతి చేసారు... శ్రీ నరసింహ స్వామీజీ ఏది చెబితే అదే అతనికి చట్టం. రాధాకృష్ణన్ ను ఆల్ ఇండియా సాయి సమాజ్, మద్రాసు వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు...
1952లో శ్రీ నరసింహ స్వామీజీ కర్ణాటక రాష్ట్రంలో సాయి ప్రచార పని కోసం రాధాకృష్ణన్‌ను బెంగళూరుకు పంపారు...
బెంగళూరులో మొదట కంటోన్మెంట్‌లో చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు..తర్వాత ఎన్.ఆర్.కాలనీ బస్టాప్‌కు సమీపంలోని ఓ ఇంట్లో మేడమీద గది సాయి ఆధ్యాత్మిక కేంద్రానికి నిలయంగా మారింది...శాశ్వత భవనం నిర్మించే వరకు రాధాకృష్ణన్ దాదాపు ఏడేళ్లపాటు అదే వసతి గృహంలో నివసించారు...
1953లో శ్రీ నరసింహ స్వామీజీ ఆయనకు " సాయిపదానంద " అనే బిరుదును ప్రదానం చేశారు. అప్పటినుండి రాధాకృష్ణన్ రాధాకృష్ణ స్వామీజీ అయ్యారు...ఏప్రిల్, 1954లో బసవం గుడిలోని సౌత్ ఎండ్ రోడ్‌లో సాయి భజన బృందం శ్రీరామనవమి వేడుకలను రాధాకృష్ణ స్వామీజీ ప్రారంభించారు..ఇదే సాయి ఆధ్యాత్మిక కేంద్రాలలో మొదటిది...
బాబా ప్రేరణతో మైసూర్ ప్రభుత్వ రిటైర్డ్ అధికారి శ్రీ దోమలూరు కృష్ణ మూర్తి బెంగుళూరులోని త్యాగరాజనగర్‌లో 1000 చదరపు గజాల స్థలాన్ని భవన నిర్మాణానికి ఇచ్చాడు...
ఆ స్థలంలో భవనాన్ని నిర్మించేందుకు ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే దేశవ్యాప్తంగా అనేక మంది భక్తుల నుంచి స్వచ్ఛందంగా నిధులు వచ్చాయి...
1965లో రాధాకృష్ణ స్వామీజీ ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు...1979లో "శ్రీ సాయి ఆధ్యాత్మిక కేంద్రం" మైసూర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది...
19-10-1956న శ్రీ. బి.వి. నరసింహ స్వామీజీ సమాధి పొందారు..1970 నుండి రాధాకృష్ణ స్వామీజీ ఆల్ ఇండియా సాయి సమాజ్, మద్రాసు అధ్యక్షుడిగా.. బెంగుళూరులోని త్యాగరాజనగర్ మందిరాన్ని కూడా చూస్తున్నారు... 1978లో పూనాలో ఆయన నాయకత్వంలో అఖిల భారత సాయి భక్తుల సమ్మేళనం విజయవంతంగా జరిగింది...
స్వామీజీ "ఉత్తరాయణ' శుభదినాల కోసం ఎదురు చూస్తూ.. జనవరి 14, 1980న సాయిలో ఐక్యమవ్వాలని నిర్ణయించుకుని..ఆ రోజు భక్తులతో కలిసి "శ్రీ విష్ణు సహస్ర నామం" పఠించి.."ఓం నమో నారాయణాయ" అంటూ జనవరి 14 ,1980న రాత్రి తన దేహాన్ని విడిచారు... మరుసటిరోజు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య స్వామీజీకి అంత్యక్రియలు జరిగాయి...
స్వామీజీ చాలా మంది భక్తులకు కలలో కనిపించి, వారి సమస్యలపై సలహాలు ఇస్తూ, వారిని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించారు...చంచలమైన మనస్సుకు శాంతి, సామరస్యం లభించే ప్రదేశం శ్రీ సాయి ఆధ్యాత్మిక కేంద్రం...
షిరిడీలో సాయి సంస్థానం వారు సమాధిమందిరంలో బాబా యొక్క ఇతర భక్తుల చిత్రపటాలతో పాటు స్వామీజీ చిత్రపటాన్ని కూడా ఉంచారు.
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:
Post a Comment