Monday, June 3, 2024

అల్లా వెలిగించిన దీపం



*అల్లా వెలిగించిన దీపం.*

*ఇచ్ఛా మరణం అనేది సాయినాథుని వంటి మహనీయుల సొత్తు.*
*వారికి ఇష్టమైతే వెల్లడిస్తారు లేకపోతే లేదు.*

*సాయి వంటి సత్పురుషులు కూడా అప్పుడప్పుడు వారి మరణం గురించి సూచనలు ఇచ్చేవారు.*

*సాయిబాబా వారి మహాసమాధికి నాలుగు నెలల ముందు అంటే సుమారుగా జూన్ నెలలో, కాసిమ్ అనే వ్యక్తితో*  
*" ఔరంగాబాద్ వెళ్ళు, అక్కడ ఉండే షంషుద్దీన్ మియాను దర్శించు. అతనికి రెండువందల రూపాయలు ఇవ్వు. అక్కడ మౌలు, కవ్వాలి, న్యాస్ జరిపించు. ఇంకా బన్నేమియా వద్దకు వెళ్లి వారి మెడలో ఈ పువ్వుల మాల వేసి " నవ్ దిన్, నవ్ తారిఖ్, అల్లా మియనే అప్నే దునియా లేగయా,మర్జీ అల్లా కి అని చెప్పు.*

*ఈ సంఘటన జూన్ మాసంలో జరిగింది.*

*బాబా అదేశం మేరకు కాసిమ్, అతనితో పాటు ఇమాంబాయి, చోటే ఖాన్, అమీర్ మున్నగువారు ఔరంగాబాద్ చేరారు.*

*శంషుద్దీన్ ను కలసి వచ్చిన పని గురించి చెప్పారు.* *షంషుద్దీన్ ఎంతో మందిని ఆహ్వానించి ఘనముగా సంతర్పణ ( న్యాస్ )చేసాడు. ముస్లిం సత్పురుషుల గూర్చి కవ్వాలి గానం జరిపించాడు.* *మౌలు కూడా ( దేవుని స్తుతిస్తూ పాడే పాటలు ) చేయించాడు* 

*ఇంక వారు బన్నేమియా వద్దకి పోయారు.* 
*అప్పటికీ బన్నేమియాకు 102 ఏళ్లు. సాయిబాబా వారి సమకాలీకులలో పేరు ప్రఖ్యాతులున్న సూఫీ సంప్రదాయపు యోగులు ముగ్గురు.*
*ఒకరు తాజుద్దిన్ బాబా, బాబా జాన్, మూడవ వారు బన్నేమియా.* 

*బన్నేమియా చిస్తీ సంప్రదాయకుడని అని అంటారు.*
*సాయిబాబాయే ఆయనకు దివ్య దర్శనం ఇప్పించి ఔరంగాబాద్ పంపారని అవతార్ మెహర్ బాబా అంటారు.*
*ఏదిఏమైనా, బన్నేమియా వద్ధకు కాసిమ్, అతని కూడా వచ్చిన వారు పోగా, బన్నేమియా తన్మయత్వంతో ఒక చేయి పైకెత్తి మ, వేరొక చేయి క్రిందకు పెట్టి నిలబడి ఉన్నారు.*
*అలాగు వారు గంటవరకు బన్నేమియా నిజస్థితి వచ్చేవరకు వేచి ఉన్నారు.*
*సాయిబాబా ఇచ్చిన పువ్వుల మాల ఇమాంఖాన్ బన్నేమియా మెడలో వేశారు .*
*బన్నేమియాకు సాయిబాబా చెప్పిన మాటలు తెలియపరిచారు.*
*అది విని, బన్నేమియా ఆకాశం వంక తదేకంగా చూస్తూ ఉండిపోయారు.*
*ఆయన కన్నుల వెంట నీరు కారసాగింది* 
*కాసీం మిత్రబృందం బన్నేమియా వద్ద సెలవు తీసుకొని షిరిడీ చేరారు.*

*బన్నేమియా, సాయిబాబా మహాసమాధి చెందిన మూడు సంవత్సరాల తరువాత ఔరంగాబాద్ లో సమాధి చెందారు.*

 *సాయిబాబా మహాసమాధి సూచన కొందరు మాత్రమే గ్రహించగలిగారు.*

🪔🕌🪔🕌🪔🕌🪔🕌🪔

No comments:

Post a Comment