ఓం శ్రీ సాయిరాం
:రుక్మిణీ సమేత విఠలునిగా బాబా దర్శనం:
1913లో రఘువీర్ భాస్కరపురంధరే తన కుటుంబంతో శిరిడీ వెళ్ళాడు. విఠలుని భక్తురాలైన అతని తల్లి షిరిడి నుండి పండరిపురం వెళదామని అతడిని ఒత్తిడి చేస్తుండేది.
పండరిపురం వెళ్ళడానికి బాబా అనుమతి తీసుకోవాలనుకున్నాడు పురందరే. కానీ అతడు బాబా వద్ద ఆ ప్రస్తావన తీసుకురాకముందే, బాబా తమంతట తామే ఆ ప్రస్తావన తీసుకొచ్చి అతని తల్లితో, "అమ్మా! పండరిపురం ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగారు.
మరునాడు మశీదులో బాబా ఆమెకు, పురంధరే భార్యకు రుక్మిణీ సమేత విఠలునిగా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. ఆ దర్శనంతో పురందరే తల్లి పండరిపురం ప్రయాణం మానుకుంది.
కానీ మరుసటి రోజు కూడా బాబా ఆమెను "అమ్మా! పండరి ఎప్పుడు వెళుతున్నావు?” అని అడిగారు. దానికామె, “నా దేవుడిక్కడే ఉన్నాడు. శిరిడీయే నా పండరిపురం” అని జవాబు చెప్పింది.
ఈ క్రింది ఫోటోని సాయిబాబా స్వయంగా పురంధరేకు అందించారు, అతను దానిని ప్రతిరోజు పూజించేవాడు. కష్టాల్లో ఉన్న సమయాల్లో ఈ ఫొటోముందు కూర్చుని తన కష్టాన్ని ,బాధని చెప్పుకునేవాడు.. వెంటనే అతని సమస్యకి పరిష్కారం లభించేది..
(Devotees of Experiences..Sri. B.V. Narasimha Swamiji...)
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹
.jpg)
No comments:
Post a Comment