Saturday, June 8, 2024

శంకర్రావు రఘునాథ్ దేశ్‌పాండే (నానాసాహెబ్ నిమోన్కర్) షిర్డీకి 20 మైళ్ల దూరంలో ఉన్న నిమోన్ గ్రామ వాస్తవ్యులు..

 ఓం శ్రీ సాయిరాం 




        శంకర్రావు రఘునాథ్ దేశ్‌పాండే (నానాసాహెబ్ నిమోన్కర్) షిర్డీకి 20 మైళ్ల దూరంలో ఉన్న నిమోన్ గ్రామ వాస్తవ్యులు..


       అతను నిమోన్ గ్రామం నుండి వచ్చినందున, అతన్ని నానాసాహెబ్ నిమోన్కర్ అని పిలిచేవారు.


      నానాసాహెబ్ నిమోన్కర్ సంగమనేర్  మేజిస్ట్రేట్.. నిమోన్, చుట్టుపక్కల 5 గ్రామాలకు గ్రామ ప్రధానాధికారి...


      నిమోన్కర్  1890లో రహతాలోని మారుతీ దేవాలయంలో మొదటిసారిగా సాయిబాబాను కలిశారు.


       1898 సంవత్సరంలో బాబాగారు తన పాదుకలను నిమోన్కర్ కి  ఇచ్చి ఆశీర్వాదించారు..


      నిమోన్కర్ వాటిని తన గృహంలో పూజగదిలో ఉంచి పూజించుకోసాగారు..


     బాబా 1898లో నిమోంకర్‌కు పాదుకలను ఇచ్చినప్పటికీ  2008 వరకు వాటిని వారి వారసులు భక్తులు దర్శించుకోవడానికి అనుమతించలేదు.


        ప్రస్తుత వారసులు నానాసాహెబ్ నిమోన్కర్ రెండవ కుమారుడు నాగనాథ్ నిమోన్కర్ మనవడు శ్రీ నందకుమార్ నిమోన్కర్ (రేవెన్నాథ్ దేశ్‌పాండే కుమారుడు...)ఈ పాదుకలని పూజిస్తున్నారు..

      

        శ్రీ నంద కుమార్ దేశ్ పాండే గారు 2008 శ్రావణమాసం నుండి భక్తులు కూడా బాబా పాదుకలు దర్శించుకోవడానికి అనుమతించారు. నిమోన్ గ్రామంలో ఇప్పటికీ వీటిని భక్తులు దర్శించవచ్చు..


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment