Saturday, June 8, 2024

సాయి భక్తుడు భావు మహారాజ్ కుంభార్ సాయిలో ఐక్యమయినరోజు..

 ఓం శ్రీ సాయిరాం 



   సాయి భక్తుడు భావు మహారాజ్ కుంభార్ సాయిలో ఐక్యమయినరోజు..


      భావు మహారాజ్ కుంభార్  మహారాష్ట్రలోని సంగమనేర్ జిల్లాలోని కైరే నీమ్‌గావ్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు..వృత్తి రీత్యా కుంభర్లు (కుమ్మరులు) అందుకే ఆ ఇంటిపేరు వచ్చింది. 


     భావు మహారాజ్ యువకుడిగా ఉన్నప్పుడు ఆ గ్రామం నుండి షిర్డీకి వచ్చి తిరిగి వెళ్ళలేదు...షిరిడీలో శని దేవాలయం దగ్గర ఉండేవాడు..


      ఒక్కోసారి రహతా, సాకోరి, నీమ్‌గావ్ వెళ్ళినా వెంటనే షిర్డీకి తిరిగి వచ్చేవాడు... చిన్న పిల్లలను, పచ్చటి చెట్లను అమితంగా ఇష్టపడేవాడు..


       ఇతను ఎప్పుడూ షిర్డీ వీధులను శుభ్రం చేసేవాడు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు షిర్డీలోని ప్రతి వీధిని శుభ్రంగా ఊడ్చేవాడు...వర్షం కురిసినా, ఎండ మండిపోతున్నా ప్రతిరోజూ అతని దినచర్య షిర్డీ గ్రామాన్ని శుభ్రం చేయడమే.. 


     షిరిడి గ్రామంలో ఎవరు ఏ పని చెప్పినా.. కాదనకుండా చేసేవాడు..ఊరిలో  ప్రతి వారికి తలలో నాలుకలా మెలిగేవాడు..


       ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు వెళ్లి బాబా దర్శనం చేసుకునేవాడు.. బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా భావు మహారాజ్ తెల్లవారుజామున 5 గంటలకి.. రోజులో చాలాసార్లు ఆయన సమాధి దర్శనం చేసుకునేవారు...


     అతను మరణించడానికి ఒక వారం ముందు  అనారోగ్యంతో ఉండటంతో...ఆకలి మందగించి ఏమీ తినకుండా కేవలం నీరు మాత్రమే తీసుకున్నాడు..ఆ సమయంలో  రఘువీర్ భాస్కర్ పురందరే, సగుణమేరు నాయక్ అతనిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు...


      అతను చైత్ర కృష్ణ పక్ష తృతీయ  27 ఏప్రిల్ 1937 నాడు తుది శ్వాస విడిచాడు...భక్తులు, షిరిడి గ్రామస్తులు అందరూ కలసి నిర్ణయించుకుని ఆయన సమాధిని లెండి బాగ్ మార్గంలో వేపచెట్టు క్రింద నిర్మించారు..


     1937 మే 7 న  మరణించిన 12వ రోజున సాధువు గౌరవార్థం గొప్ప విందు జరిగింది. మరుసటి రోజు (అంటే, 13వ రోజు) షిరాతో (బెల్లంతో చేసిన ఒక రకమైన హల్వా) మరొక విందు జరిగింది.. సంస్థానం వారు సమాధి మందిరం ఫోటో గ్యాలరీలో భావు మహారాజ్ కుంభార్ చిత్రపటాన్ని ఉంచి గౌరవస్థానం కల్పించారు..


          ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో షిర్డీ సంస్థాన్ వారు భావు మహారాజ్ కుంభార్  పుణ్యతిథిని నిర్వహిస్తారు... ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనవచ్చు.  నేటికీ చాలా మంది తల్లులు తమ పసిపిల్లలను తీసుకొచ్చి ఆయన సమాధిపై పడుకోబెట్టి అందులోంచి కొద్దిగా దుమ్ము తీసి రక్షణగా పిల్లల నుదుటిన పూస్తారు...


ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment