ఓం శ్రీ సాయిరాం 🙏 🙏
మే 19, 1953 శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగువారికి అందినరోజు..
తెలుగు రాష్ట్రాలలో ప్రతిసాయిభక్తుడు ఎంతో ఆనందంతో గుర్తుంచుకునే రోజు మే 19.. ఆరోజు శ్రీ సాయి సచ్చరిత్ర సాయి భక్తులకు అందిన రోజు..
సాయి ఎవరెవరికి ఏ కర్తవ్యాన్ని అప్పగిస్తారో? ఎవ్వరు ఊహించలేనిది.. మరాఠీలో సాయిసచ్చరిత్రని వ్రాసే అదృష్టాన్ని హేమాడ్ పంత్ కి ఇచ్చారు.. ఇంగ్లీషులో ఎన్. వి గుణాజి గారికి ఆ అదృష్టం దక్కింది.. తెలుగులో అనువదించడానికి శ్రీ పత్తి నారాయణరావు గారిని బాబా ఎంచుకున్నారు..
పత్తి నారాయణరావు గారు శివనేసన్ స్వామి వారితో కలసి.. చావిడిలో45 రోజులపాటు రోజుకు 18 గంటలు చొప్పున సచ్చరిత్రలోని ప్రతి పేజీ.. ప్రతి పేరా.. ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి.. శ్రీ సాయి సచ్చరిత్రని అనువదించారు..
సాయి ఎప్పుడూ తనకి దక్షిణగా రెండు రూపాయలు (శ్రద్ధ - సబూరి) భక్తుల నుండి ఆశించేవారు.. సాయి సచ్చరిత్రని తెలుగులోకి అనువదించిన పత్తి నారాయణరావు గారి విషయంలో బాబా ఈ శ్రద్ధ - సబూరి ఎంతవరకు ఉన్నాదో చాలా పరీక్షలు పెట్టారు..
మరాఠీలోను, ఇంగ్లీషులోనూ వ్రాసిన సచ్చరిత్రని షిరిడి సంస్థానం వారు ప్రింటింగ్ చేశారు.. కానీ తెలుగు సచ్చరిత్రకు సంస్థానం నిధుల కొరత వలన ప్రింటింగ్ చేయలేకపోయారు.. అందువలన పుస్తకం ప్రింటింగ్ చేయించడానికి నారాయణరావు గారు పడ్డ శ్రమ వర్ణనాతీతం..
ఏది జరిగినా అంతా సాయి సంకల్పం ప్రకారమే జరుగుతుంది అని ఆయన సచ్చరిత్రలో ఎన్నో తార్కాణాలు.. అలాగే తెలుగు సాయి సచ్చరిత్ర ప్రచురణ విషయంలోనూ జరిగింది.. ప్రచురణ ఎప్పుడు? ఎవరి ద్వారా? ఎక్కడ జరగాలో? సద్గురువు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప మనం అనుకుంటే జరగదు..
సచ్చరిత్ర పుస్తకాన్ని ఎలా ప్రింటింగ్ చేయాలో? దిక్కు తోచక ఆ ప్రతులని కాషాయ వస్త్రంలో కట్టుకొని.. సాయి నామ జపం చేసుకుంటూ.. అనేక తీర్థయాత్రలు చేశారు..
కాశీ, కొల్హాపూర్, కర్నూలు, మహూర్‌గఢ్, కురుపురం, గాణుగాపూర్, హుమ్నాబాద్, అక్కల్‌కోట్, సోమనాథ్, శ్రీశైలం, ఉజ్జయిని, మహాబలేశ్వర్, పరేలి, ధాకిని, రామేశ్వరం, త్రయంబకేశ్వర్ (ఈ ఘ్రుష్ణేశ్వర్) జునాగఢ్, భద్రాచలం, ద్వారక, పండరీపురం, వేమపల్లి, పూరి, తిరుపతి, శ్రీ రంగం, తిరువనంతపురంలో పారాయణ చేయడమే కాక మూడు కోట్ల నామ జపం చేశారు..
ఎన్ని క్షేత్రాలు దర్శించినా తన కోరిక తీరలేదు అని నిరాశ చెందకుండా.. తన సంకల్పాన్ని వదలక.. మరింత పట్టుదలతో నామ జపం చేసుకుంటూ.. ఆయా క్షేత్రాల యొక్క దేవీ దేవతల ఆశీర్వాదాన్ని శ్రీ సాయి సచ్చరిత్రలో నిక్షిప్తం చేసుకుంటూ క్షేత్రాల దర్శనం చేశారు..
ఏ దైవమూ తన కోరిక నెరవేర్చలేదు అని నారాయణరావు గారు ఎప్పుడు నిరాశ చెందలేదు.. మరింత పట్టుదలతో అన్ని క్షేత్రాలు దర్శించి.. సచ్చరిత్రకి సద్గురువైన ఆ సాయినాధుని ఆశీర్వాదంతో పాటు.. ఆయా క్షేత్రాల దేవతల ఆశీర్వాదం కూడా లభించింది.. అదే తెలుగు సచ్చరిత్ర పారాయణం చేసే భక్తులకు దక్కిన అదృష్టం..
క్షేత్ర దర్శనాలు పూర్తవగానే బాబానే పుస్తకం ప్రింటింగ్ ఎవరు చేస్తారో? ఎక్కడ చేస్తారో? స్వప్న దర్శనం ద్వారా నారాయణరావు గారికి చూపించి సికింద్రాబాద్ జి. ఆర్. నాయుడు గారి దగ్గరికి పంపించారు..
చివరికి జి. ఆర్ నాయుడు గారి ద్వారా...ప్రీమియం ప్రింటర్స్ అధినేత చందా నారాయణ శ్రేష్ఠి గారు.. తమ ప్రెస్ లో పుస్తకాన్ని ప్రింటింగ్ చేయడానికి అంగీకరించి.. 1953 మే 19వ తేదీన మొట్టమొదటిగా తెలుగులో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని ప్రింటింగ్ చేశారు..
సచ్చరిత్రలో బాబా శ్రద్ధ, సహనం ప్రాముఖ్యత గురించి చెప్పారు.. భక్తులు కూడా తమ ప్రవచనాలలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. కానీ ఆచరించడమే కష్టం.. ఇవి రెండు నారాయణరావు గారు ఆచరించి చూపారు..
పుస్తకాన్ని ప్రింటింగ్ చేయించడానికి వారు పడ్డ శ్రమ... చూపిన సహనం.. పెంచిన పట్టుదల.. సంకల్ప బలం.. అన్నిటికీ మించి ఆ సాయినాధుని ఆశీర్వాదం.. భారతదేశంలోని క్షేత్రాల దేవి దేవతల ఆశీర్వాదం.. నామ జపం యొక్క శక్తి.. ఇవన్నీ కలిస్తేనే.. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో సాయి భక్తులు ఎంతో భక్తితో పారాయణం చేసుకుంటున్న సాయిసచ్చరిత్ర మన ముందుకి ఆవిష్కృతమైంది..
శ్రీ సాయి సచ్చరిత్రలో ఇంత శక్తి ఉంది కనుకనే భక్తులు భక్తితో పారాయణం చేస్తున్న.. వారి కోరికలు నెరవేరుతున్నాయి.. భక్తులకు మంచి మార్గాన్ని.. మానవులు త్రికరణ శుద్ధిగా సత్కర్మలను ఆచరించడంలో దారి చూపిస్తుంది.. మనసులోని దుష్ట ఆలోచనలను పోగొడుతుంది..
సచ్చరిత్రను పారాయణం చేస్తున్న భక్తులు.. బాబా అడిగిన శ్రద్ధ, సబూరి విషయంలో ఎంతవరకు నిలబడగలుగుతున్నామని ఎవరికివారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. ఒక్కసారి మనం పారాయణం చేస్తున్న సాయి సచ్చరిత్ర ప్రింటింగ్ కోసం నారాయణరావు గారు పడ్డ శ్రమని ఆరాటాన్ని గుర్తు చేసుకుంటూ.. భక్తులు పారాయణం చేయాలి... వారే మనకి ఆదర్శం కావాలి..

No comments:
Post a Comment