Saturday, June 8, 2024

సాయి సచ్చరిత్ర 8,30 అధ్యాయాలలో ప్రస్తావించబడిన రహతా నివాసి కుశాల్ చంద్ గారి గృహం..రహతా.. షిర్డీ


 ఓం శ్రీ సాయిరాం🙏🙏

    సాయి సచ్చరిత్ర 8,30 అధ్యాయాలలో ప్రస్తావించబడిన రహతా నివాసి కుశాల్ చంద్ గారి  గృహం..రహతా.. షిర్డీ..

    రహతాలో నివసించే చంద్రభాను సెట్ మార్వాడి గారిని బాబా ఎంతగానో అభిమానించేవారు. వారి మరణానంతరం అతని అన్న కొడుకు కుశాల్ చంద్ ని బాబా ఎంతో ప్రేమతో అహర్నిశలు అతని యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు. అప్పుడప్పుడు టాంగాలో గాని, ఎద్దుల బండి మీద గాని కొంతమంది భక్తులతో కలసి రహతా వెళ్లేవారు.. రహతా ప్రజలు గ్రామ సరిహద్దు ద్వారం వద్ద బాబాను దర్శించి.. బాజాభజంత్రీలతో వైభవంగా రహతా గ్రామానికి తీసుకొని వెళ్లేవారు. కుశాల్ చంద్ బాబాని తన ఇంటికి తీసుకొని పోయి ఆసనం మీద కూర్చుండబెట్టి భోజనం పెట్టేవాడు.. కొంతసేపు ఇద్దరూ ప్రేమగా ముచ్చటించుకొన్న తర్వాత బాబా కుశాల్ చందు కుటుంబాన్ని ఆశీర్వదించి షిరిడి వచ్చేవారు..

ఓం శ్రీ సాయిరాం 🙏🙏🌹

No comments:

Post a Comment